చైనా ప్రయోజనాలకు హాని కలిగిస్తే తీవ్ర ప్రతిఘటన.. అమెరికాకి డ్రాగన్ వార్నింగ్..!

హాంగ్‌కాంగ్‌ విషయంలో జోక్యం చేసుకుంటున్న అమెరికాపై చైనా ఆగ్రహం. చైనా ప్రయోజనాలకు హానికలిగించే ఎలాంటి చర్యలు, మాటలున్నా తీవ్ర ప్రతిఘటన ఉంటుందని డ్రాగన్ వార్నింగ్.

చైనా ప్రయోజనాలకు హాని కలిగిస్తే తీవ్ర ప్రతిఘటన.. అమెరికాకి  డ్రాగన్ వార్నింగ్..!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 01, 2020 | 7:20 PM

హాంగ్‌కాంగ్‌ విషయంలో జోక్యం చేసుకుంటున్న అమెరికాపై తీరును చైనా తీవ్రంగా తప్పుబట్టింది. హాంగ్‌కాంగ్‌లో జాతీయ భద్రతా చట్టాన్ని అమలుచేయాలని ప్రయత్నిస్తున్న చైనాపై చర్యలు తప్పవని గతంలో అమెరికా అధ్యక్షులు డోనాల్డ్ ట్రంప్ అన్నారు. హాంగ్‌కాంగ్‌కు ఎంతోకాలంగా గర్వకారణంగా ఉన్న హోదాను చైనా ప్రభుత్వం అణచివేసిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ అభిప్రాయపడ్డారు. ఇందులో భాగంగా చైనా విద్యార్థులపై ఆంక్షలు తప్పవని ట్రంప్‌ ప్రకటించారు. ట్రంప్ వ్యాఖ్యలపై తాజాగా చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది రెండు దేశాలకు మంచి కాదని పేర్కొంది. చైనా ప్రయోజనాలకు హానికలిగించే ఎలాంటి చర్యలు, మాటలున్నా తీవ్ర ప్రతిఘటన ఉంటుందని చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియన్‌ హెచ్చరించారు. చైనా అంతర్గత వ్యవహారాల్లో తలదూరుస్తున్న అమెరికా చర్యల వల్ల ఇరుదేశాల మధ్య సంబంధాలు క్షీణించాయని తెలిపారు.