వాటికన్ వ్యవహారాలపై చైనా కన్ను, నెట్ వర్క్ ల హ్యాకింగ్ ?

తమ దేశంలోని అతి పెద్ద కేథలిక్ చర్చిని తమ ఆధీనంలోకి తీసుకోవడానికి చైనా ప్రయత్నిస్తోందని వార్తలు వస్తున్నాయి. చైనా పేట్రియాటిక్ అసోసియేషన్ దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నప్పటికీ.. బీజింగ్ అధికారులు రహస్యంగా..

వాటికన్ వ్యవహారాలపై చైనా కన్ను, నెట్ వర్క్ ల హ్యాకింగ్ ?
China Intelligence
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 30, 2020 | 2:52 PM

తమ దేశంలోని అతి పెద్ద కేథలిక్ చర్చిని తమ ఆధీనంలోకి తీసుకోవడానికి చైనా ప్రయత్నిస్తోందని వార్తలు వస్తున్నాయి. చైనా పేట్రియాటిక్ అసోసియేషన్ దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నప్పటికీ.. బీజింగ్ అధికారులు రహస్యంగా ఈ పనిలో నిమగ్నమై ఉన్నారట. ఇప్పటికే తమ దేశంలోని ముస్లిం ఉదిగర్స్, టిబెటన్ బుధ్ధిస్టులు, క్రిస్టియన్ల పట్ల వేధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపణలు ఎదుర్కొంటున్న చైనా.. వాటికన్ లోని నెట్ వర్క్ లపై దృష్టి పెట్టిందని, ‘ముస్తాంగ్ పాండా’, ‘రెడ్ డెల్టా’ వంటి హ్యాకర్ల గ్రూపులు వాటికన్ నెట్ వర్క్ ల్లో చొరబడ్డారని అనుమానిస్తున్నామని  న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది.ఈ హ్యాకర్లు వైరస్ తో కూడిన సాఫ్ట్ వేర్ ని కూడా ఉపయోగిస్తున్నారట . అయితే ఈ ఆరోపణలను చైనా కొట్టి పారేస్తోంది. హాంకాంగ్ లోని కేథలిక్ చర్చిని కూడా తాము  స్వాధీనం చేసుకోవడానికి  యత్నిస్తున్నామని అమెరికా ఆరోపిస్తోందని , కానీ ఇందుకు ఆధారాలు లేవని చైనా అధికారులు అంటున్నారు.