అమెరికా ఆపింది.. చైనా నేను ఉన్నానంది

కరోనాపై ప్రపంచ ఆరోగ్య సంస్థ జరుపుతున్న పోరులో ఆ సంస్థకు మరో 30 మిలియన్ డాలర్లను విరాళంగా ఇస్తున్నామని  చైనా ప్రకటించింది.

అమెరికా ఆపింది.. చైనా నేను ఉన్నానంది
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Apr 23, 2020 | 3:55 PM

కరోనాపై ప్రపంచ ఆరోగ్య సంస్థ జరుపుతున్న పోరులో ఆ సంస్థకు మరో 30 మిలియన్ డాలర్లను విరాళంగా ఇస్తున్నామని  చైనా ప్రకటించింది. కరోనా వైరస్ కు చైనాయే కారణమని, చైనా పక్షపాతిగా మారిన ఈ సంస్థ ఈ వ్యవహారాన్ని మిస్ హ్యాండిల్ చేసినందున దీనికి ఆర్ధిక సాయాన్ని ఆపివేస్తున్నామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆ మధ్య పేర్కొన్న సంగతి తెలిసిందే . పైగా తాము ఈ సంస్థకు సంవత్సరానికి 400 మిలియన్ల నుంచి 500 మిలియన్ డాలర్ల వరకు ఇస్తుండగా.. చైనా మాత్రం 40 మిలియన్ డాలర్లే ఇస్తోందని కూడా ఆయన ఆరోపించారు. అయితే చైనా మాత్రం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కు మద్దతు ప్రకటిస్తూ.. తాము ఇదివరకే ఈ సంస్థకు 20 మిలియన్ డాలర్ల సాయాన్ని అందించామని, ఇప్పుడు మరో 30 మిలియన్ డాలర్లను డొనేట్ చేస్తున్నామని వెల్లడించింది. ఈ మేరకు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి గెంగ్ షువాంగ్ ఓ స్టేట్ మెంట్ ఇస్తూ.. ఈ ఆరోగ్య సంస్థ పట్ల తమ ప్రభుత్వానికి, తమ దేశ ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందని చెప్పారు.