చైనాలో మరోసారి ఆఫ్రికన్ల పట్ల విపక్ష..?

చైనాలో మరోసారి ఆఫ్రికన్ల పట్ల విపక్ష కొనసాగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. విశ్వవ్యాప్తంగా కరోనావైరస్ విస్తరిస్తున్న వేళ.. కరోనా పుట్టినిల్లు చైనాలో జాతి అహంకార ధోరణి కనిపిస్తుందని బ్లాక్ చైనా అనే హ్యాష్‌ట్యాగ్ కింద కెన్నా దేశస్థులు చేస్తున్న కామెంట్స్ బట్టి అర్థమవుతోంది. అయితే చైనా రాష్ట్ర మీడియా మాత్రం ఇవన్నీ నిరాధారమైన పుకార్లు అని కొట్టిపారేస్తుంది. గ్వాంగ్జౌలోని ఆఫ్రికన్స్ ఉంటున్న అపార్ట్మెంట్ లో కరోనా టెస్ట్ లే మరోసారి చైనా-ఆఫ్రికా సంబంధాలలో చీలికకు కారణమైంది. దక్షిణ చైనా […]

చైనాలో మరోసారి ఆఫ్రికన్ల పట్ల విపక్ష..?
Follow us

|

Updated on: May 26, 2020 | 4:22 PM

చైనాలో మరోసారి ఆఫ్రికన్ల పట్ల విపక్ష కొనసాగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. విశ్వవ్యాప్తంగా కరోనావైరస్ విస్తరిస్తున్న వేళ.. కరోనా పుట్టినిల్లు చైనాలో జాతి అహంకార ధోరణి కనిపిస్తుందని బ్లాక్ చైనా అనే హ్యాష్‌ట్యాగ్ కింద కెన్నా దేశస్థులు చేస్తున్న కామెంట్స్ బట్టి అర్థమవుతోంది. అయితే చైనా రాష్ట్ర మీడియా మాత్రం ఇవన్నీ నిరాధారమైన పుకార్లు అని కొట్టిపారేస్తుంది. గ్వాంగ్జౌలోని ఆఫ్రికన్స్ ఉంటున్న అపార్ట్మెంట్ లో కరోనా టెస్ట్ లే మరోసారి చైనా-ఆఫ్రికా సంబంధాలలో చీలికకు కారణమైంది. దక్షిణ చైనా నగరమైన గ్వాంగ్జౌలో ఆసియాలో అత్యధిక ఆఫ్రికా జనాభా ఉంటుంది. గ్వాంగ్జౌలో 2017 లెక్కల ప్రకారం 3 లక్షల 20 వేల మందికి పైగా ఆఫ్రికన్లు నివసిస్తున్నారు. గత నెలలో చాలా మంది ఆఫ్రికన్లకి ప్రయాణ చరిత్రతో సంబంధం లేకుండా బలవంతపు కరోనావైరస్ పరీక్షలు నిర్వహించారు. అంతేకాదు ఏకపక్షంగా 14-రోజుల స్వీయ నిర్బంధంలో ఉండాలని ఆదేశించారు. వైరస్ నియంత్రణ చర్యలల్లో భాగంగా హోటళ్లకు తిరస్కరించారు. అర్థాంతరంగా రూమ్స్ ని ఖాళీ చేయించడంతో చాలా మంది నిరాశ్రయులయ్యారు. గ్వాంగ్జౌలోని ఆఫ్రికన్స్ ఉంటున్న అపార్ట్మెంట్ లో కరోనా టెస్ట్ లే చైనా-ఆఫ్రికా సంబంధాలలో చీలికకు కారణమైంది. ఈ సంఘటన ఆఫ్రికన్ దేశాల విదేశాంగ మంత్రిత్వ శాఖతో పాటు పలు ఆఫ్రికన్ యూనియన్లు తీవ్రంగా స్పందించాయి. వెంటనే వీటికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశాయి. అయినప్పటికీ చైనా అధికారులు మాత్రం వివక్ష జరిగిందని అంగీకరించడం లేదు. విదేశీయులందరినీ సమానంగా చూస్తామని, వివక్షను సహించలేమని ఇలాంటి ఘటనలను పునరావృతం కాకుండా చూస్తామని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి జావో లిజియన్ అన్నారు. గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ లో ఆఫ్రికన్లపై వివక్ష లేదని దక్షిణాఫ్రికాలోని చైనా రాయబార కార్యాలయం కూడా ఒక ప్రకటన విడుదల చేసింది.