Breaking News
  • హైదరాబాద్‌: తార్నాకలో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్‌ సదస్సు. పాల్గొన్న గవర్నర్‌ తమిళిసై.
  • ప్రకాశం జిల్లా మార్టూరుకు బయల్దేరిన చంద్రబాబు. ప్రజాచైతన్య యాత్రను ప్రారంభించనున్న చంద్రబాబు.
  • కడప: రాయచోటి వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం. పాల్గొన్న ఎంపీ మిథున్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి. పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించిన ఎంపీ, ఎమ్మెల్యేలు.
  • వరంగల్‌లో వాటర్‌ మెన్‌ ఆఫ్‌ ఇండియా రాజేంద్రసింగ్‌ గోదావరి యాత్ర. కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించి రైతులతో సమావేశం. గోదావరి జలాల సద్వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వానికి ప్రశంసలు.
  • అమరావతి: చంద్రబాబు భద్రతను ఉద్దేశపూర్వకంగా తగ్గించారు. అధికార పార్టీ ఇలాంటి చర్యలకు పాల్పడడం తగదు-యనమల రామకృష్ణుడు. ఈ విషయంపై మండలిలో చర్చిస్తాం. అవసరమైతే ప్రివిలేజ్‌ కమిటీకి ఫిర్యాదు చేస్తాం-యనమల రామకృష్ణుడు.
  • నిర్మల్‌: మంచిర్యాలలో ఛత్రపతి శివాజీ విగ్రహావిష్కరణలో ఉద్రిక్తత. మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డిని అడ్డుకున్న బీజేపీ నేతలు. టీఆర్‌ఎస్‌, బీజేపీ నేతల మధ్య వాగ్వాదం, సర్దిచెప్పిన పోలీసులు. మంత్రితో కలిసి విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎంపీ సోయం బాపూరావు.

వుహాన్ వైరస్.. చైనా నుంచి తాజాగా అమెరికాలో ..

China s Vuhan Virus Comes to the US, వుహాన్ వైరస్.. చైనా నుంచి తాజాగా అమెరికాలో ..

చైనాను వణికిస్తున్న వుహాన్ వైరస్ ఇప్పుడు అమెరికాలోను ప్రవేశించింది.  ఈ వైరస్ సోకి చైనాలో 9 మంది మరణించగా.. సుమారు 400 మందికి పైగా ఈ వైరస్ బారిన పడ్డారు. ఇప్పుడు అమెరికాలో సీటెల్ నగరానికి చెందిన 30 ఏళ్ళ వ్యక్తికి ఈ వైరస్ సోకడంతో అతడిని ఆసుపత్రికి తరలించి ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే ఆ వ్యక్తి ఆరోగ్యంగానే ఉన్నాడని ఆసుపత్రి అధికారులు చెబుతున్నప్పటికీ.. ముందు జాగ్రత్త చర్యగా చికిత్స చేస్తున్నట్టు వారు వివరించారు. సార్స్ తరహా వైరస్ తనకు సోకిందని అతడు చెప్పాడట. చైనాలోని వుహాన్ ప్రాంతానికి వెళ్లి ఈ నెల 15 న ఇతడు స్వదేశానికి తిరిగివచ్చాడు. దానికి రెండు రోజుల ముందే  చైనా నుంచి వచ్ఛే ప్రయాణికులను స్కాన్ చేసేందుకు ప్రధాన విమానాశ్రయాల్లోఆరోగ్య శాఖ అధికారులను ప్రభుత్వం నియమించడమే కాకుండా.. స్కానింగ్ ఏర్పాట్లు కూడా చేసింది. తాజాగా మరో ఐదు విమానాశ్రయాలకు కూడా ఈ సౌకర్యాన్ని విస్తరించారు.

2019 లో చైనాలోని వుహాన్‌లో ప్రారంభమైన ఈ వైరస్‌ను కొరోనా వైరస్ లేక ‘2019-ఎన్-కొవ్’‌గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటివరకు ఇది మనుషుల మధ్య వ్యాప్తి చెందదని భావిస్తూ వచ్చినప్పటికీ.. అది సరికాదని, వ్యక్తులకు సులువుగా సోకుతుందని చైనా నేషనల్ హెల్త్ కమిషన్ ధృవీకరించింది. ఈ వైరస్ కారణంగా గ్లోబల్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాలా  అన్న విషయాన్ని నిర్ణయించేందుకు ఐక్యరాజ్యసమితి ఆరోగ్య వ్యవహారాల ఏజన్సీ బుధవారం అత్యవసరంగా సమావేశమవుతోంది. గతంలో సార్స్ వైరస్ సోకి, శ్వాస సరిగా ఆడక, విపరీతమైన జ్వరంతో చైనా, హాంకాంగ్ లలో దాదాపు 650 మంది మృతి చెందారు. థాయ్‌లాండ్, జపాన్, దక్షిణ కొరియా, తైవాన్‌లలోనూ ఈ వైరస్ లక్షణాలను కనుగొన్నారు. కాగా…   ఈ వారంలో చైనా కొత్త ఏడాది వేడుకలు జరగనుండగా.. లక్షలాది మంది ప్రయాణాలకు సిధ్ధపడుతున్నారు. దీంతో రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, షాపింగ్ మాల్స్‌లో రద్దీ పెరుగుతోంది. ముఖ్యంగా వుహాన్ నుంచి వచ్ఛే ప్రయాణికుల పట్ల అధికారులు అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.China s Vuhan Virus Comes to the US, వుహాన్ వైరస్.. చైనా నుంచి తాజాగా అమెరికాలో .. China s Vuhan Virus Comes to the US, వుహాన్ వైరస్.. చైనా నుంచి తాజాగా అమెరికాలో .. China s Vuhan Virus Comes to the US, వుహాన్ వైరస్.. చైనా నుంచి తాజాగా అమెరికాలో ..

 

Related Tags