చైనా బంపర్ ఆఫర్.. ఒకరిని పట్టిస్తే రూ. 54 వేలు

అన్ని దేశాల కంటే ముందే కరోనా మహమ్మారి బారి నుంచి కోలుకుంటున్న చైనాలో మళ్లీ కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో.. వైరస్ ప్రభుతోన్న ప్రాంతాల్లో మళ్లీ లాక్‌డౌన్ విధించింది. అలాగే కరోనాతో వున్నవారు కనిపిస్తే చాలు..

చైనా బంపర్ ఆఫర్.. ఒకరిని పట్టిస్తే రూ. 54 వేలు
Follow us

| Edited By:

Updated on: Apr 16, 2020 | 3:54 PM

చైనాలో పుట్టిన కరోనా వైరస్ మహమ్మారి ఇప్పుడు ప్రపంచమంతా వ్యాపించింది. దీని ఎఫెక్ట్‌ ప్రపంచవ్యాప్తంగా లక్షాల 20 వేలకు పైగా ప్రజలు మరణించగా.. 19 లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా రష్యా, ఇటలీ, న్యూయార్క్, అమెరికాల్లో ఈ వైరస్ తీవ్రంగా విజృంభిస్తోంది. దీంతో ఆ దేశ అధ్యక్షులు.. చైనాపై విరుచుకుపడుతున్నాయి. ఇప్పుడు తమ వల్లే ప్రపంచమంతా ఆ రోగం విస్తరించిందనే అపప్రధను మూటగట్టుకుంటోంది.

కాగా అన్ని దేశాల కంటే కరోనా మహమ్మారి బారి నుంచి కోలుకుంటున్న చైనాలో మళ్లీ కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో.. వైరస్ ప్రబలుతోన్న ప్రాంతాల్లో మళ్లీ లాక్‌డౌన్ విధించింది. అలాగే కరోనాతో ఉన్నవారు కనిపిస్తే చాలు వారిని ఆస్పత్రిలో జాయిన్ చేయాలని పేర్కొంటుంది. ఇది చాలదన్నట్టు పొరుగున ఉన్న రష్యా నుంచి అక్రమంగా చైనీయులు చొరబడుతున్నారు. కరోనా వల్ల విమానాలను రద్దు చేయడంతో విదేశాల్లో చిక్కుకుపోయిన చైనీయులు అక్రమంగా సొంత దేశానికి వచ్చేస్తున్నారు.

రష్యా నుంచి చైనా ఈశాన్య ప్రాంతంలోని హిలోంగ్జియాంగ్ రాష్ట్రానికి వందల సంఖ్యలో వచ్చారు. దీంతో అక్కడ 79 కేసులు నమోదయ్యాయి. వలసే దీనికి కారణమని భావించిన చైనా అధికారులు కొత్తగా వచ్చిన వారిని వేటాడుతున్నారు. అలాంటి వారి ఆచూకీ చెబితే రూ. 54 వేలు రివార్డు ఇస్తామని ప్రకటించారు. ముఖ్యంగా సరిహద్దులోని సూయిఫెన్హేలో కొత్త ముఖాలు పెద్ద సంఖ్యలో కనిపిస్తుండటంతో తనిఖీలను ముమ్మరం చేశారు.

Read More:  పిజ్జా డెలివరీ బాయ్‌కి కరోనా పాజిటివ్

హైదరాబాద్‌లో కరోనా పేషెంట్ అరెస్ట్.. దేశంలోనే ఫస్ట్ టైమ్

నా కాపురం నయనతార వల్లే కూలిపోయింది.. ప్రభుదేవ మాజీ భార్య ఫైర్..

‘రాజముద్ర’ను మార్చేసిన ఏపీ సీఎంవో.. కారణం అదేనా?