నేపాల్ ని ‘కబళిస్తున్న’ చైనా, చోద్యం చూస్తున్న ఓలి ప్రభుత్వం

నేపాల్ దేశాన్ని చైనా మెల్లగా 'కబళిస్తోంది'. తమ దేశంలోని 7 బోర్డర్ జిల్లాల్లో చాలా భూభాగాలను డ్రాగన్ కంట్రీ చేజిక్కించుకుందని నేపాల్ వాపోతోంది. సాక్షాత్తూ నేపాల్ వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని..

నేపాల్ ని 'కబళిస్తున్న' చైనా, చోద్యం చూస్తున్న ఓలి ప్రభుత్వం
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 22, 2020 | 7:52 PM

నేపాల్ దేశాన్ని చైనా మెల్లగా ‘కబళిస్తోంది’. తమ దేశంలోని 7 బోర్డర్ జిల్లాల్లో చాలా భూభాగాలను డ్రాగన్ కంట్రీ చేజిక్కించుకుందని నేపాల్ వాపోతోంది. సాక్షాత్తూ నేపాల్ వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సర్వే విభాగమే ఆయా జిల్లాల్లోని పరిస్థితిని సర్వే చేసి ఈ విషయాన్ని వెల్లడించింది. ఇది అక్రమ చొరబాటే అని నిర్ధారించింది. ఇంత జరుగుతున్నా ప్రధాని కేపీ శర్మ ఓలి ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. సర్కార్ కిమ్మనడంలేదు. చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ నేతలను ఎదిరిస్తే  తమకు ఎక్కడ ముప్పు వస్తుందోనని ప్రభుత్వం భయపడుతోందని అంటున్నారు. నేపాల్ లో డోలఖా, దార్చులా, హుమ్లా, రసువా తదితర జిల్లాల్లో చైనీయులు కనబడుతున్నా..నేపాలీలు కళ్ళుమూసుకుని తలవంచుకుని పోతున్నారట.

మొత్తానికి మరికొన్ని నెలల్లో చైనా.. నేపాల్ తో గల తమ సరిహద్దుల్లో అన్ని నేపాల్ జిల్లాలను అక్రమంగా ఆక్రమించుకున్నా ఓలి సర్కార్ దాసోహమనే తీరులో ఉన్నట్టు కనిపిస్తోంది.