Breaking News
  • కరీంనగర్‌: హుజూరాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో టిక్‌టాక్‌ కలకలం. ఆపరేషన్‌ థియేటర్‌లో టిక్‌టాక్‌ చేసిన వైద్యులు. రోగికి ఆపరేషన్‌ చేస్తూ టిక్‌టాక్‌ చేసిన వైద్యుడు శ్రీకాంత్, బృందం. సోషల్‌మీడియాలో వైరలైన వీడియో. వైద్యుల తీరుపై మండిపడుతున్న స్థానికులు.
  • సికింద్రాబాద్‌లో అఖిల భారత పోలీస్‌ బ్యాండ్‌ పోటీల ముగింపు వేడుకలు. హాజరైన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.
  • యాదాద్రి:సర్నేనిగూడెం సర్పంచ్ కుటుంబాన్నిపరామర్శించిన కోమటిరెడ్డి. రూ.50 వేలు ఆర్థిక సాయాన్ని అందజేసిన ఎంపీ కోమటిరెడ్డి. సర్పంచ్‌ కుటుంబానికి నా ప్రగాఢ నానుభూతి తెలియజేస్తున్నా. సర్పంచ్‌ కుటుంబానికి రూ.25 లక్షల ఆర్థిక సాయం ప్రకటించాలి. నావంతుగా సర్పంచ్‌ కుటుంబాన్ని ఆదుకుంటా. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తా-ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.
  • నిజామాబాద్‌: ఎడపల్లిలో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం. పురుగుల మందుతాగి ఆత్మహత్యకు యత్నించిన ప్రేమజంట. పరిస్థితి విషమం, ఆస్పత్రికి తరలింపు.
  • ఢిల్లీ: జస్టిస్ ధర్మాధికారి నేతృత్వంలో ఏపీ, టీఎస్ అధికారుల భేటీ. విద్యుత్‌ ఉద్యోగుల విభజన సమస్యలపై సమావేశమైన అధికారులు. ఉదయం అధికారులు, ఉద్యోగుల అభ్యంతరాలు స్వీకరించిన ధర్మాధికారి. ధర్మాధికారి నివేదిక ప్రకారం 655 మంది ఉద్యోగులు.. తమకు భారమవుతున్నారని చెప్పిన ఏపీ డిస్కంలు. కమిటీ నివేదికతో సమస్యలున్నాయన్న టీఎస్ జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ. ఉద్యోగుల సమస్య శాంతియుతంగా పరిష్కారమయ్యేందుకే.. నివేదికను అంగీకరిచామన్న తెలంగాణ సీఎండీ ప్రభాకర్‌రావు. విధుల్లోకి చేర్చుకోనందు వల్ల ఇబ్బందులు పడుతున్నట్టు.. ధర్మాధికారికి తెలిపిన ఏపీకి కేటాయించిన ఉద్యోగులు. సమస్యకుపరిష్కారం నివేదిక నుంచి తెచ్చేలా ప్రయత్నిద్ధాం-ధర్మాధికారి. సమస్యను మొదటికితెచ్చి ఉద్యోగుల విభజనను జఠిలం చేయొద్దు-ధర్మాధికారి.

కశ్మీర్ పై చైనా వైఖరి మారినట్టేనా ?

China has done a course correction on Article 370 move in Kashmir, కశ్మీర్ పై చైనా వైఖరి మారినట్టేనా ?

వివాదాస్పద కశ్మీర్ విషయంలో చైనా తన వైఖరిని మార్చుకున్నట్టే కనిపిస్తోంది. ఈ అంశంలో పాకిస్తాన్ ను పూర్తిగా ఏకాకిని చేసినట్టేనని అంటున్నారు. ఇప్పుడిక ఏ దేశమూ పాక్ కు అండగా నిలిచిన దాఖలాల్లేవు. కశ్మీర్ కు సంబంధించి ఆర్టికల్ 370 ని మోదీ ప్రభుత్వం రద్దు చేసిన అనంతరం పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ దీనిపై రంకెలేసిన సంగతి తెలిసిందే. ఈ సమస్య ఐరాస నిబంధనావళికి కట్టుబడి ఉందని, ఐరాస తీర్మానాల ప్రకారం దీన్ని పరిష్కరించుకోవాల్సి ఉందని ఇమ్రాన్ అంటూ వచ్చారు. పైగా భారత్ పై అణు యుధ్ధం జరుపుతామని కూడా బీరాలు పలికారు. కానీ చైనా అనుసరించిన ‘ డిప్లొమసీ డోస్ ‘ తో ఆయన గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయింది. ఈ వివాదాన్ని భారత-పాకిస్థాన్ దేశాలు పరస్పర సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాలని. ఇది ద్వైపాక్షిక సమస్య అని చైనా స్పష్టం చేసింది. ఆ దేశ విదేశాంగ అధికార ప్రతినిధి గెంగ్ షువాంగ్ ఇటీవలే ఈ ప్రకటన చేశారు. పైగా టర్కీ కూడా చైనా అభిప్రాయంతో ఏకీభవించింది . ఐరాస సమావేశాల్లోనే ఆ దేశం తన వైఖరిని వెల్లడించింది. కాగా మూడు రోజుల క్రితమే -చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ భారత పర్యటన ఖరారైన నేపథ్యంలో ఆ దేశం కాశ్మీర్ విషయంలో పునరాలోచనలో పడి… ఇండియాకు అనుకూల ధోరణి పాటించక తప్పలేదు.

Related Tags