ఇకపై సిమ్‌ కావాలంటే..స్కాన్‌ చేయాల్సిందే..! ఎక్కడ?

మీరు కొత్తగా సిమ్‌ తీసుకోవాలనుకుంటున్నారా..? అయితే, ముందుగా మీరు ఈ కండిషన్స్‌కి అంగీకరించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు సాధారణంగా కొత్త సిమ్‌ తీసుకోవాలంటే..ప్రొవైడర్లను సంప్రదించి, బయోమెట్రిక్‌ స్కాన్‌,  అడ్రస్‌ ఫ్రూవ్‌, అవసరమైతే పాస్‌ఫోటో, తగిన ఫీజు చెల్లిస్తే చాలు. కానీ, ఇప్పుడు అలా కాదు..రూల్స్‌ మారిపోయాయి. ఇక పై కొత్త సిమ్‌కార్డు కావాలంటే, అన్ని ధ్రువీకరణ పత్రాలతో పాటుగా ముఖాన్ని కూడా స్కాన్‌ చేస్తారట. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించి ముఖాన్ని చుట్టూ స్కాన్‌ చేయడంతో పాటు..కళ్లు మూయడం, […]

ఇకపై సిమ్‌ కావాలంటే..స్కాన్‌ చేయాల్సిందే..! ఎక్కడ?
Follow us

|

Updated on: Dec 02, 2019 | 3:29 PM

మీరు కొత్తగా సిమ్‌ తీసుకోవాలనుకుంటున్నారా..? అయితే, ముందుగా మీరు ఈ కండిషన్స్‌కి అంగీకరించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు సాధారణంగా కొత్త సిమ్‌ తీసుకోవాలంటే..ప్రొవైడర్లను సంప్రదించి, బయోమెట్రిక్‌ స్కాన్‌,  అడ్రస్‌ ఫ్రూవ్‌, అవసరమైతే పాస్‌ఫోటో, తగిన ఫీజు చెల్లిస్తే చాలు. కానీ, ఇప్పుడు అలా కాదు..రూల్స్‌ మారిపోయాయి. ఇక పై కొత్త సిమ్‌కార్డు కావాలంటే, అన్ని ధ్రువీకరణ పత్రాలతో పాటుగా ముఖాన్ని కూడా స్కాన్‌ చేస్తారట. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించి ముఖాన్ని చుట్టూ స్కాన్‌ చేయడంతో పాటు..కళ్లు మూయడం, తెరవడం వంటివి కూడా పూర్తయ్యాకే సిమ్‌ జారీ చేస్తారట. ఈ మేరకు నిబంధనలను డిసెంబర్‌ ఒకటో తేదీ నుంచే అమల్లోకి తెస్తున్నట్లుగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మొబైల్‌ వాడే వారు తమ ఫోన్ల రిజిస్టేషన్‌లో అసలు పేరునే వినియోగించాలంటూ గత సెప్టెంబర్‌లో నిబంధనలు తెచ్చింది అక్కడి ప్రభుత్వం. ఈ చర్యలన్నీ ఆన్‌లైన్‌ ప్రపంచంలో ప్రజల హక్కులను కాపాడటం కోసమేనని ప్రభుత్వం అంటోంది ప్రభుత్వం. అయితే, ఇదంతా ఎక్కడో చెప్పనే లేదు కదా..! ఈ రూల్స్‌ డ్రగెన్‌ కంట్రీ చైనా ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది.