నేపాల్ పై చైనా కన్ను.. ఖాట్మండులో గూఢచారులు ?

నేపాల్ లోని ప్రస్తుత రాజకీయ సంక్షోభాన్ని చైనా తన ప్రయోజనాలకు అనువుగా మలచుకోవాలని ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఆ దేశంపై కన్నేసిన డ్రాగన్ కంట్రీ. ఖాట్మండులో . తమ గూఢచారులను..

నేపాల్ పై చైనా కన్ను.. ఖాట్మండులో గూఢచారులు ?
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 02, 2020 | 7:02 PM

నేపాల్ లోని ప్రస్తుత రాజకీయ సంక్షోభాన్ని చైనా తన ప్రయోజనాలకు అనువుగా మలచుకోవాలని ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఆ దేశంపై కన్నేసిన డ్రాగన్ కంట్రీ. ఖాట్మండులో . తమ గూఢచారులను.. కరోనా పై పోరు జరిపే డాక్టర్లుగా ప్రవేశపెట్టినట్టు సమాచారం. నేపాల్ ప్రధాని కెపి శర్మ ఓలి రాజీనామా చేయాలన్న డిమాండ్ అక్కడ ఊపందుకుంటోంది. ఈ నేపథ్యంలో ఆ దేశంపై భారత ప్రభావాన్ని తగ్గించేందుకు చైనాతో బాటు పాకిస్తాన్ కూడా పెద్ద కుట్ర పన్నుతోందని  భారత సెక్యూరిటీ ఏజెన్సీ వర్గాలు తెలిపాయి. చైనాకు చెందిన మిలిటరీ ఆఫ్ స్టేట్ సెక్యూరిటీ తన ఉనికిని నేపాల్ లో పెంచుకోవడం ప్రారంభించిందని, అలాగే పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. శర్మ ఓలికి తన మద్దతును ప్రకటించారని ఈ వర్గాలు పేర్కొన్నాయి. పాక్ ఐఎస్ఐ…. నేపాల్ లోని ఇతర నేతలతో టచ్ లో ఉంటున్నట్టు తెలిసింది. భారత, నేపాల్ మధ్య తలెత్తిన వివాదాన్ని ఈ రెండు దేశాలూ తమకు అనుకూలంగా మార్చుకునేందుకు యత్నిస్తున్నాయన్నది ఈ వార్తల సారాంశం. అయితే భారత సైన్యం ఈ పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తోంది.