మా వాళ్ళను ప్రాసిక్యూట్ చేస్తే, అమెరికాకు చైనా వార్నింగ్

అమెరికా కోర్టుల్లో చైనా మేధావులను, విద్యావేత్తలను ప్రాసిక్యూట్ చేసిన పక్షంలో తమ దేశంలోని అమెరికన్లను తాము కూడా ప్రాసిక్యూట్ చేస్తామని చైనా..అమెరికాను హెచ్ఛరించింది.

మా వాళ్ళను ప్రాసిక్యూట్ చేస్తే, అమెరికాకు చైనా వార్నింగ్
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Oct 18, 2020 | 10:42 AM

అమెరికా కోర్టుల్లో చైనా మేధావులను, విద్యావేత్తలను ప్రాసిక్యూట్ చేసిన పక్షంలో తమ దేశంలోని అమెరికన్లను తాము కూడా ప్రాసిక్యూట్ చేస్తామని చైనా..అమెరికాను హెచ్ఛరించింది. ఇక్కడి మీ దేశ స్కాలర్లు మా  చట్టాలను ఉల్లంఘిస్తున్నారు అని చైనా ప్రభుత్వం ఆరోపించింది. ఈ మేరకు వాల్ స్ట్రీట్ జర్నల్ ఓ కథనాన్ని ప్రచురిస్తూ..ఈ సందర్భంలో అమెరికా విదేశాంగ శాఖ అమెరికన్లను హెచ్ఛరిస్తూ చేసిన ఓ ప్రకటనను ప్రస్తావించింది. చైనాకు వెళ్లవద్దని, వెళ్లిన పక్షంలో ఆ దేశ ప్రభుత్వం అమెరికన్లను నిరంకుశంగా నిర్బంధిస్తుందని ఈ శాఖ జారీ చేసిన వార్నింగ్ ని గుర్తు చేసింది. అమెరికాలో చదువుకుంటున్న చైనా విద్యార్థుల వీసాలను ట్రంప్ ప్రభుత్వం రద్దు చేయడంపై చైనా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇది తమపై కక్ష గట్టడమేనని మండిపడుతోంది.