16వేల మసీదులను చైనా ధ్వంసం చేసిందంటున్న ఏఎస్‌పీఐ

చైనా వాడు నాజీలను మించిపోయాడు.. అక్కడి మైనారిటీలపై దాష్టికం చేస్తున్నాడు.. మానవహక్కులను కాలరాస్తున్నాడు.. మసీదును ధ్వంసం చేస్తున్నాడు. షిన్‌జియాంగ్‌ ప్రావిన్స్‌లోని వీగర్‌ తెగకు చెందిన ముస్లింలను నానా హింసపెడుతున్నాడు..

16వేల మసీదులను చైనా ధ్వంసం చేసిందంటున్న  ఏఎస్‌పీఐ
Follow us

|

Updated on: Sep 26, 2020 | 1:50 PM

చైనా వాడు నాజీలను మించిపోయాడు.. అక్కడి మైనారిటీలపై దాష్టికం చేస్తున్నాడు.. మానవహక్కులను కాలరాస్తున్నాడు.. మసీదును ధ్వంసం చేస్తున్నాడు. షిన్‌జియాంగ్‌ ప్రావిన్స్‌లోని వీగర్‌ తెగకు చెందిన ముస్లింలను నానా హింసపెడుతున్నాడు.. ఇంతదానికే అంతెత్తున ఎగిరిపడే పాకిస్తాన్‌.. ఇవన్నీ తెలిసి గమ్మునుంటోంది.. రీసెంట్‌గా అక్కడ సుమారు 16 వేల మసీదులను కూల్చివేశారట చైనా అధికారులు.. ఈ విషయాన్ని ఆస్ట్రేలియా నిపుణుల బృందం వెలుగులోకి తీసుకొచ్చింది.. ముస్లింలను నిర్బంధ క్యాంపుల్లో ఉంచుతూ వారిని తీవ్రంగా హింసిస్తున్నారనే ఆరోపణలు కొత్తవేమీ కావు.. గడచిన మూడేళ్లలోనే దాదాపు 8,500 మసీదును కూల్చివేసిందని ఆస్ట్రేలియన్‌ స్ట్రాటెజిక్‌ పాలసీ ఇన్‌స్టిట్యూట్‌ తెలిపింది.. శాటిలైట్‌ సాయంతో ఫోటోలు తీసి మరీ ఈ విషయాన్ని రుజువు చేసింది.. ఒక్క ముస్లింలనే టార్గెట్‌ చేసింది చైనా ప్రభుత్వం.. క్రిస్టియన్ల చర్చీలు, బౌద్ధుల మందిరాల జోలికి వెళ్లడం లేదని ఏఎస్‌పీఐ చెబుతోంది. వీగర్‌ తెగకు చెందిన ముస్లింలను చైనా నిర్బంధంలో పెట్టిందన్న వార్తలు రాగానే చైనా ఉలిక్కిపడింది.. అబ్బే అలాంటిదేమీ లేదని కొట్టిపారేసింది.. కానీ సాక్ష్యాధారాలతో సహా ఈ విషయం వెలుగులోకి రావడంతో ఇక ఒప్పుకోక తప్పలేదు. ముస్లింలకు మంచి విద్యను అందించడానికే అలా చేశాం తప్ప, ఇందులో ఎలాంటి దురాలోచనలేదని చెప్పుకుంది.. చైనా మాటలను అంతర్జాతీయ సమాజం నమ్మలేదు.. ఇలాంటి దుశ్చర్యలను వెంటనే ఆపేయాలంటూ ఆదేశించింది. అమెరికా అయితే అగ్గిమీద గుగ్గిలమయ్యింది.. ఆ ప్రాంతంలో తయారయ్యే వస్తువులను దిగుమతి చేసుకోకూడదని నిర్ణయించింది. ఇంత జరుగుతున్నా చైనా మాత్రం తన చర్యలను సమర్థించుకుంటూ వస్తోంది..