కరోనా వైరస్‌ సృష్టికర్తలం తాము కాదంటున్న చైనా

కరోనా వైరస్‌ను పుట్టించారంటూ అమెరికాతో పాటు ప్రపంచదేశాలన్నీ ఆడిపోసుకుంటుండటంతో చైనా వివరణ ఇచ్చుకోవలసిన పరిస్థితి ఏర్పడింది.. కోవిడ్‌-19 తమ దగ్గర ఉన్న ఉహాన్‌ నగరంలో పుట్టిందనే నీలాపనిందను తమపై వేస్తున్నారు కానీ..

కరోనా వైరస్‌ సృష్టికర్తలం తాము కాదంటున్న చైనా
Follow us

|

Updated on: Oct 10, 2020 | 8:51 AM

కరోనా వైరస్‌ను పుట్టించారంటూ అమెరికాతో పాటు ప్రపంచదేశాలన్నీ ఆడిపోసుకుంటుండటంతో చైనా వివరణ ఇచ్చుకోవలసిన పరిస్థితి ఏర్పడింది.. కోవిడ్‌-19 తమ దగ్గర ఉన్న ఉహాన్‌ నగరంలో పుట్టిందనే నీలాపనిందను తమపై వేస్తున్నారు కానీ అందులో ఇసుమంతైనా నిజం లేదని చెబుతోంది చైనా. ప్రపంచంలోని వేరువేరు ప్రాంతాలలో ఈ వైరస్‌ పుట్టిందని, అలా ప్రపంచమంతా వ్యాప్తి చెందిందని డ్రాగన్‌ కొత్త భాష్య చెప్పింది. అసలు ఈ వైరస్‌ను ముందుగా కనిపెట్టిన తాము ప్రపంచాన్ని అప్రమత్తం చేశామని, అందుకే దేశాలన్నీ తమకు కృతజ్ఞతలు చెప్పుకోవాలని చైనా తెలిపింది.. ఉహాన్‌లో కోవిడ్‌-19 పుట్టిందన్నది అర్థరహితమని చెప్పింది.. పొద్దున్నలేస్తే తమను దెప్పిపొడుస్తున్న అమెరికాపై కూడా రుసరుసలాడింది.. ఉహాన్‌లోని ప్రయోగశాలలో కరోనా వైరస్‌ను పుట్టించారని, అది ప్రపంచమంతా పాకేలా చేశారని అమెరికా పదే పదే అనడాన్ని చైనా ఖండించింది. జంతువుల మార్కెట్‌ నుంచి.. గబ్బిలాల నుంచి కరోనా వైరస్‌ పుట్టిందన్నది కూడా అవాస్తమని చైనా విదేశాంగశాఖ ప్రతినిధి హువా చునియింగ్‌ చెప్పుకొచ్చారు. కరోనా వైరస్‌ జన్యుక్రమాన్ని ప్రపంచానికి అందచేసి గొప్ప మేలు చేశామన్నారు. కరోనా వైరస్‌ ఎక్కడి నుంచి వచ్చింది? ఎలా వచ్చింది? అన్నదానిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ దర్యాప్తు చేయబోతున్నది.. ఇది తెలిసే చైనా ఇలాంటి వ్యాఖ్యలు చేసిందేమో!

ఎరను మింగి మృత్యువు కోరల్లోకి వెళ్లిన కింగ్ కోబ్రా.. ఉమ్మడానికి..
ఎరను మింగి మృత్యువు కోరల్లోకి వెళ్లిన కింగ్ కోబ్రా.. ఉమ్మడానికి..
చిరును టార్గెట్ చేసిన రిషబ్ షెట్టి.. పోటీ మాములుగా లేదుగా..!
చిరును టార్గెట్ చేసిన రిషబ్ షెట్టి.. పోటీ మాములుగా లేదుగా..!
వీడో అసలైన జాతిరత్నం.. ఆన్సర్ పేపర్‌లో ఏం రాశాడో చూసి టీచర్ షాక్!
వీడో అసలైన జాతిరత్నం.. ఆన్సర్ పేపర్‌లో ఏం రాశాడో చూసి టీచర్ షాక్!
చిగుళ్ల వ్యాధి గుండెపోటుకు కారణం కావచ్చు.. వివరాలు తెలుసుకోండి
చిగుళ్ల వ్యాధి గుండెపోటుకు కారణం కావచ్చు.. వివరాలు తెలుసుకోండి
'కాస్త సిగ్గుండాలే'.. RCB ఆటగాళ్లు చేసిన పనికి అభిమానుల ఆగ్రహం
'కాస్త సిగ్గుండాలే'.. RCB ఆటగాళ్లు చేసిన పనికి అభిమానుల ఆగ్రహం
ఈ చిన్నది ఓ స్టార్ హీరోయిన్ చెల్లి.. ఆ పాన్ ఇండియా నటి ఎవరంటే.?
ఈ చిన్నది ఓ స్టార్ హీరోయిన్ చెల్లి.. ఆ పాన్ ఇండియా నటి ఎవరంటే.?
వామ్మో, ఇదేం డ్యాన్స్‌రా సామీ.. నాగిని పాటకు పైథాన్‌ స్టెప్పులు..
వామ్మో, ఇదేం డ్యాన్స్‌రా సామీ.. నాగిని పాటకు పైథాన్‌ స్టెప్పులు..
మహేష్ బాబుతో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా.?
మహేష్ బాబుతో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా.?
ఇంటర్‎లో ఫెయిల్ అయిన ఇద్దరు విద్యార్థులు.. మనస్థాపంతో ఆత్మహత్య..
ఇంటర్‎లో ఫెయిల్ అయిన ఇద్దరు విద్యార్థులు.. మనస్థాపంతో ఆత్మహత్య..
స్దాన బలం గురించి వేమన చెప్పిన పద్యానికి సజీవ సాక్ష్యం ఈ వీడియో
స్దాన బలం గురించి వేమన చెప్పిన పద్యానికి సజీవ సాక్ష్యం ఈ వీడియో