భూటాన్ భూభాగాలు మావే ! జగడాలమారి చైనా కొత్త స్లోగన్

నేపాల్ పైనా.. తాజాగా భూటాన్ పై కూడా చైనా కన్నేసింది. భూటాన్ లో చాలా భూభాగాలు తమకు చెందినవేనని వాదిస్తోంది. తద్వారా పరోక్షంగా ఇండియాపై ఒత్తిడి పెంచుతోంది. చైనా-భూటాన్ సరిహద్దులు..

భూటాన్ భూభాగాలు మావే ! జగడాలమారి చైనా కొత్త స్లోగన్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 06, 2020 | 3:49 PM

నేపాల్ పైనా.. తాజాగా భూటాన్ పై కూడా చైనా కన్నేసింది. భూటాన్ లో చాలా భూభాగాలు తమకు చెందినవేనని వాదిస్తోంది. తద్వారా పరోక్షంగా ఇండియాపై ఒత్తిడి పెంచుతోంది. చైనా-భూటాన్ సరిహద్దులు ఎప్పుడూ ‘డీ-లిమిట్’ కాలేదని, భూటాన్ లోని తూర్పు, పశ్చిమ, మధ్య ప్రాంతాలకు సంబంధించి తమకు, ఈ దేశానికి మధ్య వివాదాలు ఉన్నాయని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ వాదిస్తోంది. అందువల్ల ఈ విషయంలో మూడో దేశం (ఇండియా) కలగజేసుకోరాదని పరోక్షంగా పేర్కొంది. తమ తూర్పు ప్రాంతం లోని  వన్యమృగ సంరక్షణ కేంద్రానికి గ్లోబల్ ఎన్విరాన్ మెంట్ ఫెసిలిటీ కౌన్సిల్ నుంచి గ్రాంట్ (నిధులు) కావాలంటూ గత జూన్ 29 న భూటాన్ ‘దరఖాస్తు’ పెట్టుకోగా చైనా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ కేంద్రం వ్యవహారం వివాదాస్పదమైనదని అడ్డుపుల్ల వేసింది. కాగా- కౌన్సిల్ నుంచి భూటాన్ కి నిధులు అందినప్పటికీ చైనా బెదిరింపు ధోరణిలో వ్యవహరించిందని ఆరోపణలు వెల్లువెత్తాయి. చైనా దూకుడుపై భూటాన్.. ఢిల్లీలోని ఆ దేశ ఎంబసీకి తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ గట్టి కౌంటరిచ్చింది. ఆ వన్యమృగ సంరక్షణ కేంద్రం పూర్తిగా తమకు చెందినదేనని స్పష్టం చేసింది. భూటాన్ దగ్గరి డోక్లామ్ లోకి 2017 లో చైనా సైనికులు చొచ్చుకు రాగా.. వారికి, భారత సైనికులకు మధ్య 72 రోజుల పాటు  ఘర్షణ జరిగింది. చివరకు యధాతథ పరిస్థితి నెలకొంది.