గ్రాండ్‌గా చైనా నేషనల్‌ డే… భారీ పరేడ్‌తో అమెరికాకు డ్రాగన్‌ హెచ్చరిక!

డ్రాగన్‌ కంట్రీ తన సైనిక సత్తాను ప్రపంచానికి చాటింది. గ్రాండ్‌గా మిలటరీ పరేడ్‌ నిర్వహించింది. నేషనల్‌ డే సందర్భంగా జరిగిన ఈవెంట్‌ కలర్‌ఫుల్‌గా సాగింది. దేశ ఆర్థిక ప్రగతి ఉట్టిపడేలా ప్రదర్శన జరిగింది. చైనా మాజీ అధ్యక్షులు కూడా నేషనల్‌ డే ఈవెంట్‌లో పాల్గొన్నారు. చైనాలో కమ్యూనిస్ట్‌ ప్రభుత్వం ఏర్పడి 70 ఏళ్లు అవుతోంది. ఈ 70 ఏళ్లలో డ్రాగన్‌ కంట్రీ అసాధారణ అభివృద్ధి సాధించింది. ఈ సందర్భంగా తమ ఆర్ధిక అభివృద్ధి, సైనిక సత్తాను ప్రపంచ […]

గ్రాండ్‌గా చైనా నేషనల్‌ డే... భారీ పరేడ్‌తో అమెరికాకు డ్రాగన్‌ హెచ్చరిక!
Follow us

| Edited By:

Updated on: Oct 01, 2019 | 11:53 PM

డ్రాగన్‌ కంట్రీ తన సైనిక సత్తాను ప్రపంచానికి చాటింది. గ్రాండ్‌గా మిలటరీ పరేడ్‌ నిర్వహించింది. నేషనల్‌ డే సందర్భంగా జరిగిన ఈవెంట్‌ కలర్‌ఫుల్‌గా సాగింది. దేశ ఆర్థిక ప్రగతి ఉట్టిపడేలా ప్రదర్శన జరిగింది. చైనా మాజీ అధ్యక్షులు కూడా నేషనల్‌ డే ఈవెంట్‌లో పాల్గొన్నారు.

చైనాలో కమ్యూనిస్ట్‌ ప్రభుత్వం ఏర్పడి 70 ఏళ్లు అవుతోంది. ఈ 70 ఏళ్లలో డ్రాగన్‌ కంట్రీ అసాధారణ అభివృద్ధి సాధించింది. ఈ సందర్భంగా తమ ఆర్ధిక అభివృద్ధి, సైనిక సత్తాను ప్రపంచ దేశాలకు చాటి చెప్పేలా జిన్‌పింగ్‌ ప్రభుత్వం మిలటరీ పరేడ్‌ నిర్వహించింది. ఈ పరేడ్‌తో రాజధాని బీజింగ్‌ మార్మోగిపోయింది. సుమారు 15వేల మంది సైనికులతో జరిగిన పరేడ్‌ అందరిని ఆకట్టుకుంది. ఈ ఈవెంట్‌లో కొత్తగా సమకూర్చుకున్న ఆయుధాలను కూడా ప్రదర్శించింది చైనా. ఈ పరేడ్‌కు మాజీ అధ్యక్షులు హూ జింటావో, జియాంగ్‌ జెమిన్‌లు కూడా హాజరయ్యారు. తైమ‌న్‌స్క్వేర్‌లో సైనికులు జాతీయ జెండాను ఆవిష్క‌రించారు.

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ మిలటరీ గౌరవ వందన స్వీకరించారు. ప్రతీ ఏడాది అక్టోబర్‌ 1వ తేదీన చైనా జాతీయ దినోత్సవాన్ని జరుపుకుంటుంది. 1949లో పీపుల్స్ రిప‌బ్లిక్ ఆఫ్ చైనా ఏర్పాటు అయ్యింది. ఇప్పటికి చైనాలో కమ్యూనిస్ట్‌ ప్రభుత్వం ఏర్పడి 70 ఏళ్ల పూర్తి కావడంతో ఈవెంట్‌ను మరింత గ్రాండ్‌గా నిర్వహించింది. సైనిక పరేడ్‌ తిలకించేందుకు వేలాదిగా జనం తరలివచ్చారు. దీంతో తైమ‌న్‌స్క్వేర్‌ కిక్కిరిసిపోయింది. రెడ్‌ కార్పెట్‌పై వందలాది మంది సైనికులు చేసిన పరేడ్‌ అందరిని ఆకట్టుకుంది. దీంతో పాటు సైనిక విన్యాసాలు కూడా చూపరులను కట్టిపడేశాయి. వినువీధుల్లో చైనా ఎయిర్‌ఫోర్స్‌ చేసిన విన్యాసాలు కూడా అందరిని ఆశ్చర్యపరిచాయి.

కమ్యూనిస్ట్‌ ప్రభుత్వం ఏర్పడి 70 ఏళ్లు అయింది. ఆ సందర్భాన్ని కచ్చితంగా సెలబ్రేట్‌ చేసుకోవాలి. కానీ చైనా భారీ పరేడ్‌ వెనుక ఇదొక్కటే రీజన్‌ కాదు… అసలు విషయం మరొకటి ఉంది. ప్రపంచానికి తన సైనిక సత్తా ఏంటో చూపించడం. ముఖ్యంగా అమెరికా లాంటి దేశాలకు ఇదీ తమ సత్తా అని చెప్పడం ! ఇంతకీ డ్రాగన్‌ కంట్రీ సైనిక సత్తా ఎంత ? కొత్తగా చైనా ఆర్మీ చేతికొచ్చిన ఆయుధాలేంటి ?

ప్రపంచ దేశాలు నోరెళ్ల బెట్టే స్థాయిలో చైనా పరేడ్‌ నిర్వహించింది. బీజింగ్‌ మార్మోగిపోయే రేంజ్‌లో సైనిక పరేడ్‌ జరిగింది. పనిలో పనిగా తమ సైనిక సత్తాను కూడా ప్రపంచానికి చూపించింది డ్రాగన్‌ కంట్రీ. పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ ప్రపంచంలోనే పెద్దది. ఈ పరేడ్‌లో 160 యుద్ధ విమానాలతో పాటు దాదాపుగా 580 రకాల ఆయుధాలను చైనా ప్రదర్శించింది. ఈ పరేడ్‌తో ప్రపంచ దేశాలకు చైనా సత్తా ఏంటో తెలిసింది.

గతంతో పోల్చుకుంటే ఇప్పుడు చైనా యుద్ధ సామర్ధ్యం బాగా పెరిగింది. సబ్‌ మెరైన్లు మొదలుకొని యుద్ధ విమానాల వరకు డ్రాగన్‌ కంట్రీ వద్ద లేని ఆయుధమంటూ లేదు. డ్రాగన్‌ కంట్రీ వద్ద ఉన్న కీలక బాలిస్టిక్‌ క్షిపణుల్లో డీఎఫ్‌ 17 ఒకటి. దీన్ని డాంగ్‌ ఫెంగ్‌ 17 హైపర్‌ సానిక్‌ డాలిస్టిక్‌ క్షిపణిగా పిలుస్తారు. 2017లో దీన్ని చైనా తొలిసారి పరీక్షించింది. అత్యంత వేగంగా కదులుతూ ప్రత్యర్ధి రక్షణ వ్యవస్థను ఇది తప్పుదోవ పట్టించగలదు. ఈ మిసైళ్లు చాలా తక్కువ ఎత్తులో గంటకు 6,115 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తాయి. దీంతో సులభంగా శత్రు దేశాల రాడార్​ కంట పడకుండా అది తప్పించుకోగలుగుతుంది. లక్ష్యాలను మార్చుకునే సామర్థ్యం దీనికి గలదు. అంతేకాదు అణ్వాయుధాలను సైతం ఇది మోసుకెళ్లగలదు.

చైనా ఆయుధ సంపత్తిలో హెచ్‌ఈ6ఎన్‌ బాంబర్‌ యుద్ధ విమానం చాలా కీలకం. చైనా ఎయిర్‌ఫోర్స్‌కు ఇది ప్రధాన బలం. డీఎఫ్‌ఈ21 నౌకా విధ్వంసక క్షిపణులను ఇది మోసుకెళ్లగలదు. అంతేకాదు గాల్లోనే ఇంధనం నింపుకునే టెక్నాలజీ ఇందులో ఉంది. హెచ్​–6కేకి ఇది అడ్వాన్స్​డ్​ మోడల్​. ఈ యుద్ధ విమానాన్ని కూడా పరేడ్‌లో ప్రదర్శించారు.

సుదూర ప్రాంతాలకు ప్రయాణించి బాంబిగ్‌ చేయగల హెచ్‌ 6 కొత్త వెర్షన్‌ కూడా చైనా దగ్గర ఉంది. దీనికి యాంటీ షిప్‌ క్షిపణులను అమర్చినట్లు ప్రచారం కూడా జరిగింది. గతంలో దీనికి సంబంధించిన ఫోటోలను ట్విట్టర్‌లో పెట్టిన చైనా…. ఎందుకో కానీ వెంటనే వాటిని తొలగించింది. చైనా వద్ద యుద్ధ ట్యాంకర్లు లెక్కలేనన్ని ఉన్నాయి. ఇందులో టైప్‌ 15, టైప్‌ 99 కీలకం. వీటితో రిహార్సల్స్‌ కూడా చేసింది చైనా ఆర్మీ. టైప్‌ 15 యుద్ధ ట్యాంకులు చాలా తేలికగా ఉంటాయి.

చైనా నేవీ సత్తా కూడా బలంగానే ఉంది. ప్రస్తుతం డ్రాగన్‌ కంట్రీకి చెందిన 4 సబ్​మెరైన్లు సముద్ర జలాల్లో తిరుగుతున్నాయి. ఒక్కో సబ్​మెరీన్​లో 12 జేఎల్​ 2 మిసైళ్లు ఉంటాయి. ఈ మిసైళ్లు సుమారు 7,200 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను సైతం ఛేదించగలవు. దీనికంటే మరింత శక్తివంతమైన జేఎల్‌ 3 క్షిపణిని కూడా గతేడాది చైనా పరీక్షించింది. అయితే దీనిపై అధికార ప్రకటన మాత్రం చేయలేదు. మొత్తంగా చైనా తన యుద్ధ సామర్ధ్యం ఏ స్థాయిలో ఉందో… ఈ మిలిటరీ పరేడ్‌ ద్వారా ప్రపంచ దేశాలకు చూపించింది.

చైనా భారీ పరేడ్‌ లక్ష్యం… డైరెక్ట్‌గా అమెరికాకు స్ట్రాంగ్‌ వార్నింగ్ ఇవ్వడమే !‌ చైనాతో సై అంటే సై అనే అగ్రరాజ్యానికి తన సత్తా ఏంటో చూపించింది డ్రాగన్‌ కంట్రీ. నేషనల్‌ డే సందర్భంగా చైనా ప్రదర్శించిన ఆయుధ సంపత్తి ఓ విధంగా అమెరికాకు కూడా షాకిచ్చింది. అగ్రరాజ్యం వద్ద లేని ఆయుధాలను చైనా ప్రదర్శించింది. ప్రపంచ దేశాలపై ఆధిపత్యం కోసం పోటీ పడే దేశాల్లో అమెరికా, చైనా ఒకటి. ఆ మాటకొస్తే ఈ రెండు దేశాలు ఆ లిస్టులో ముందు వరుసలో నిలుస్తున్నాయి. వర్తక, వాణిజ్యాలు మొదలుకొని చిన్న పెద్ద దేశాలపై పెత్తనం చెలాయించాలని చూసే దేశాలు ఈ రెండు. అందుకే ఈ రెంటికి మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమంటుంది. ఇప్పుడు అమెరికాపై చైనా తన ఆధిపత్యం చూపించుకునే ప్రయత్నం చేసింది. నేషనల్‌ డే సందర్భంగా తమ యుద్ధ సామర్ధ్యాన్ని అమెరికాకు చూపించింది.

చైనా తమ నేషనల్‌ డేలో అత్యంత ఆధునిక ఆయుధాలను ప్రదర్శించింది. అరగంటలో అమెరికాను ఢీకొట్టి బాలిస్టిక్‌ మిస్సైల్స్‌ను కూడా తెరపైకి తెచ్చింది. డీఎఫ్​ 41 మిసైల్..పరేడ్​ మొత్తంలో ఈ క్షిపణి అందరి దృష్టిని ఆకర్షించింది. ఎందుకంటే భూమ్మీదే అత్యంత పవర్​ఫుల్​ మిస్సైల్‌ ఇదే ! ఎందుకంటే ఖండాల అవతల ఉన్న లక్ష్యాలను ఇది ఛేదించగలదు. అందుకే దీన్ని ఖండాతర క్షిపణిగా పిలుస్తారు. దీని రేంజ్‌ ఏకంగా 15వేల కిలోమీటర్లు. పీఎల్​ఏ రాకెట్​ ఫోర్సెస్​కు ఇదే ప్రధాన అస్త్రం.

ఆయుధాల పరంగా టాప్​లో ఉండే అమెరికా వద్ద కూడా డీఎఫ్​ 41 స్థాయి మిస్సైల్స్‌ లేవు. చైనా నుంచి దీన్ని ప్రయోగిస్తే అమెరికాను జస్ట్​ 30 నిమిషాల్లో చేరిపోతుంది. ఒకేసారి 10 వార్‌హెడ్లను తీసుకెళ్లే సామర్థ్యం దీని సొంతం. మొన్నామధ్య మంగోలియాలోని ఓ సైట్​లో చైనా దీన్ని పరీక్షించింది. శబ్దవేగం కంటే దాదాపుగా 25 రెట్ల వేగంతో ఇది దూసుకెళ్లగలదు. ఇప్పటికే చైనా వద్ద 11,200 కిలోమీటర్లు ప్రయాణించే డాంగ్‌ఫెంగ్‌ క్షిపణి ఉంది. 1997 నుంచి దీన్ని అభివృద్ధి చేస్తూ వచ్చింది చైనా. 2015, 2017 మిలటరీ పరేడ్లలోనే దీన్ని ప్రదర్శిస్తారని అంతా భావించారు. కానీ డ్రాగన్‌ కంట్రీ దీన్ని రహస్యంగానే ఉంచింది. ఇప్పుడు దక్షిణ చైనా సముద్రంలో జరుగుతున్న ఘర్షణల నేపథ్యంలో చైనా ఈ ఆయుధాన్ని ప్రదర్శించడం విశేషం.

గుడ్‌న్యూస్‌.. ఐపీఎల్‌ కోసం జియో టాప్‌-5 డేటా రీఛార్జ్‌ ప్లాన్స్
గుడ్‌న్యూస్‌.. ఐపీఎల్‌ కోసం జియో టాప్‌-5 డేటా రీఛార్జ్‌ ప్లాన్స్
పొరపాటు కూడా మంచిదే.. ఇవి గింజలు కాదు దివ్యాస్త్రాలు..
పొరపాటు కూడా మంచిదే.. ఇవి గింజలు కాదు దివ్యాస్త్రాలు..
కాంగ్రెస్‌ని టచ్ చేస్తే హైటెన్షన్ వైర్‌ని టచ్ చేసినట్టే: రేవంత్
కాంగ్రెస్‌ని టచ్ చేస్తే హైటెన్షన్ వైర్‌ని టచ్ చేసినట్టే: రేవంత్
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇల్లు.. బిలియనీర్లు కూడా ఆలోచిస్తాడు
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇల్లు.. బిలియనీర్లు కూడా ఆలోచిస్తాడు
పేటీఎం యూజర్లకు గుడ్ న్యూస్.. సేవలన్నీ యథాతథం.. ఆ ఒక్కటే మార్పు..
పేటీఎం యూజర్లకు గుడ్ న్యూస్.. సేవలన్నీ యథాతథం.. ఆ ఒక్కటే మార్పు..
ఎంత మార్పు.. తను ఇప్పుడు స్టార్ హీరోయిన్ అంటే నమ్ముతారా..?
ఎంత మార్పు.. తను ఇప్పుడు స్టార్ హీరోయిన్ అంటే నమ్ముతారా..?
హాట్ హాట్ సమ్మర్.. కూల్ కూల్ ట్రిప్స్ ప్లాన్ చేస్తున్నారా..?
హాట్ హాట్ సమ్మర్.. కూల్ కూల్ ట్రిప్స్ ప్లాన్ చేస్తున్నారా..?
డబుల్ డిజిట్ టార్గెట్‌గా రాష్ట్రానికి బీజేపీ జాతీయ నేతలు
డబుల్ డిజిట్ టార్గెట్‌గా రాష్ట్రానికి బీజేపీ జాతీయ నేతలు
పాంఫ్రేట్ ఫిష్ ఫ్రై ఇలా చేశారంటే.. లొట్టలేసుకుంటూ తినేస్తారు!
పాంఫ్రేట్ ఫిష్ ఫ్రై ఇలా చేశారంటే.. లొట్టలేసుకుంటూ తినేస్తారు!
'ఎన్ని కోట్లు ఖర్చైనా రోహిత్‌ను తీసుకుంటాం.. కెప్టెన్‌ను చేస్తాం'
'ఎన్ని కోట్లు ఖర్చైనా రోహిత్‌ను తీసుకుంటాం.. కెప్టెన్‌ను చేస్తాం'
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!