జగన్ ప్రభుత్వానికి ఇంకో షాక్.. మరో రుణమూ లేనట్టే !

ఏపీ కొత్త రాజధాని అమరావతి నిర్మాణం కోసం ఆ రాష్ట్రానికి ఇవ్వాల్సిన 200 మిలియన్ డాలర్ల రుణాన్ని చైనా ఆధ్వర్యంలోని ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ విరమించుకుంది. ‘అమరావతి సస్టెయినబుల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్స్‌టిట్యూషనల్ డెవలప్‌మెంట్’ పేరిట గల ఈ ప్రాజెక్టుకు తాము ఇవ్వదలచిన ఈ రుణానికి సంబంధించి ఎలాంటి పరిశీలన జరపడంలేదని ఈ బ్యాంక్ ప్రతినిధి ఒకరు రాయిటర్స్ వార్తాసంస్థకు ఈ-మెయిల్ ద్వారా పంపిన సమాచారంలో తెలిపారు. ఈ ప్రాజెక్టుకు ప్రపంచ బ్యాంక్ […]

జగన్ ప్రభుత్వానికి ఇంకో షాక్.. మరో రుణమూ లేనట్టే !
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Jul 23, 2019 | 5:38 PM

ఏపీ కొత్త రాజధాని అమరావతి నిర్మాణం కోసం ఆ రాష్ట్రానికి ఇవ్వాల్సిన 200 మిలియన్ డాలర్ల రుణాన్ని చైనా ఆధ్వర్యంలోని ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ విరమించుకుంది. ‘అమరావతి సస్టెయినబుల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్స్‌టిట్యూషనల్ డెవలప్‌మెంట్’ పేరిట గల ఈ ప్రాజెక్టుకు తాము ఇవ్వదలచిన ఈ రుణానికి సంబంధించి ఎలాంటి పరిశీలన జరపడంలేదని ఈ బ్యాంక్ ప్రతినిధి ఒకరు రాయిటర్స్ వార్తాసంస్థకు ఈ-మెయిల్ ద్వారా పంపిన సమాచారంలో తెలిపారు. ఈ ప్రాజెక్టుకు ప్రపంచ బ్యాంక్ రుణాన్ని నిరాకరించిన వారంలోగానే ఈ ‘ విత్ డ్రా ‘ వార్త కూడా రావడం ఆశ్చర్యం. ఈ ప్రతిపాదిత ప్రాజెక్టుకు సంబంధించి పరిశీలన ఏదీ జరపలేదని వరల్డ్ బ్యాంక్ ప్రతినిధి ఒకరు ఇటీవల తెలిపారు. అమరావతిలో బలవంతంగా జరిపిన భూముల సేకరణలో అవకతవకలు జరిగాయని, అలాగే కృష్ణానదిపై నిర్మించిన అక్రమ కట్టడాలవల్ల వ్యవసాయ భూములకు నీరు అందకపోవడంతో సుమారు 20 వేల రైతు కుటుంబాలు ఆవాసం కోల్పోయాయని వచ్చిన ఫిర్యాదులను వరల్డ్ బ్యాంకు పరిశీలించినట్టు సమాచారం. ఇలాంటివన్నీ ఆ బ్యాంకు దృష్టికి వెళ్లినట్టు తెలుస్తోంది. తమ అసెస్ మెంట్ రిపోర్టులో ఈ బ్యాంకు ఈ ప్రాజెక్టును ‘ఏ కేటగిరీ’లోకి చేర్చింది. అంటే పర్యావరణ సంబంధమైన వ్యతిరేక ఫలితాలుంటాయన్నది ఈ కేటగిరీలో ఉన్న ఓ ప్రధాన అంశం. ఈ ఫిర్యాదులపై స్వతంత్రంగా దర్యాప్తు జరుపుతామని, ఇందుకు అనుమతించాలని ఆ బ్యాంకు కోరింది. అయితే ఓ ‘ బయటి ఏజన్సీ’ దర్యాప్తునకు అనుమతి నిచ్చేందుకు ఏపీ ప్రభుత్వం నిరాకరించింది. రుణం కోసం పెట్టుకున్న దరఖాస్తును ఉపసంహరించుకుంది. నిజానికి ఏషియన్ బ్యాంకు, వరల్డ్ బ్యాంకు రెండూ కలిపి ఏపీకి 700 మిలియన్ డాలర్లను రుణంగా ఇవ్వాల్సి ఉంది.

కాగా.. ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ప్రస్తుత సీఎం, వైసీపీ అధినేత జగన్ మధ్య ఈ ప్రాజెక్టుపై తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. కృష్ణానదిపై కట్టడాల విషయంలో అవకతవకలేవీ జరగలేదని, ఇది సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టు అని చంద్రబాబు ఇటీవల పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుకు జగన్ ఆధ్వర్యంలోని వైసీపీయే అడ్డంకులు సృష్టించిందని ఆయన ఆరోపించారు. రైతులను రెచ్ఛగొట్టి వరల్డ్ బ్యాంకుకు లేఖలు రాయించారని కూడా ఆయన అన్నారు. కానీ ఈ ఆరోపణలను అధికార వైసీపీ ఖండించింది. ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్.. తాజాగా అసెంబ్లీలో చేసిన ప్రకటనలో.. రైతులు, పర్యావరణవేత్తలు టీడీపీ ప్రభుత్వంపై చేసిన అవినీతి ఆరోపణల ఫలితంగానే ప్రపంచ బ్యాంకు రుణాన్ని వెనక్కి తీసుకుందన్నారు. అటు-నేషనల్ అలయెన్స్ పీపుల్స్ మూవ్‌మెంట్స్ , ఫైనాన్షియల్ ఇన్స్‌టిట్యూషన్లపై గల వర్కింగ్ గ్రూప్ వంటి సంస్థలు వరల్డ్ బ్యాంకు విత్ డ్రా నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశాయి. ఈ ప్రాజెక్టు విషయంలో పర్యావరణ పరంగా ఎన్నో ఉల్లంఘనలు జరిగాయని ఈ సంస్థలు పేర్కొన్నాయి.