బోర్డర్లో చైనా సైనికులకు చుక్కలు చూపిస్తోన్న ప్రకృతి.!

భారత సరిహద్దుల్లో భారీగా బలగాలను మోహరించి, ఇండియా మీద కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న చైనాకు ప్రకృతి చుక్కలు చూపిస్తోంది. శీతాకాలం ఇంకా స్టార్ట్ కాకుండానే లద్దాఖ్‌లో వాతావరణం ప్రతికూలంగా మారింది.

బోర్డర్లో చైనా సైనికులకు చుక్కలు చూపిస్తోన్న ప్రకృతి.!
Follow us

|

Updated on: Sep 19, 2020 | 1:39 PM

భారత సరిహద్దుల్లో భారీగా బలగాలను మోహరించి, ఇండియా మీద కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న చైనాకు ప్రకృతి చుక్కలు చూపిస్తోంది. శీతాకాలం ఇంకా స్టార్ట్ కాకుండానే లద్దాఖ్‌లో వాతావరణం ప్రతికూలంగా మారింది. సముద్రమట్టానికి చాలా ఎత్తున ఉండే ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. పాంగాంగ్ సరస్సు దగ్గర ఎత్తైన ఫింగర్స్ (ప్రాంతాలు) కొన్నింటిపై పాగా వేసిన చైనా సైనికులు తీవ్ర అనారోగ్యాల పాలవుతున్నారు. ఇప్పటికే ఫింగర్ 4 దగ్గర అనారోగ్యం పాలైన వారిని ఫింగర్‌ 6 దగ్గరున్న వైద్య శిబిరానికి తరలించినట్టు చైనా మీడియా వెల్లడిస్తోంది. అటు, చైనా సైనికులను వైద్య సిబ్బంది చికిత్స కోసం ఫీల్డ్ ఆస్పత్రికి తరలిస్తుండటం భారత్ సైనికుల కంటపడినట్టు తెలుస్తోంది. సముద్ర మట్టానికి దాదాపు 17 వేల అడుగుల ఎత్తులో ఉండే ఈ ప్రాంతాలు.. వాతావరణం రీత్యా ఇరు దేశాల సైన్యానికి కఠిన సవాళ్లు విసురుతాయని సైన్యాధికారులు వ్యాఖ్యానిస్తున్నారు.