ముక్కు ద్వారా ఇచ్చే టీకా తయారీలో చైనా సైంటిస్టులు

కరోనా వైరస్ పుట్టిల్లులో దానికి విరుగుడును కూడా కనుగొన్నట్లు ఆ దేశ శాస్త్రవేత్తలు ప్రకటించారు. కొవిడ్ నివారణకు ముక్కు ద్వారా ఇచ్చే టీకాను చైనా సైంటిస్టులు అభివృద్ధి చేశారు

ముక్కు ద్వారా ఇచ్చే టీకా తయారీలో చైనా సైంటిస్టులు
Follow us

|

Updated on: Sep 11, 2020 | 7:19 PM

కరోనా వైరస్ పుట్టిల్లులో దానికి విరుగుడును కూడా కనుగొన్నట్లు ఆ దేశ శాస్త్రవేత్తలు ప్రకటించారు. కొవిడ్ నివారణకు ముక్కు ద్వారా ఇచ్చే టీకాను చైనా సైంటిస్టులు అభివృద్ధి చేశారు. దీనిపై క్లినికల్‌ ట్రయల్స్ నిర్వహణకు సైతం చైనా ప్రభుత్వం తొలిసారిగా అనుమతులు ఇచ్చేసింది. మొదటి విడత టీకా ప్రయోగ పరీక్షలు నవంబర్‌ నెలలో నిర్వహించనున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ఇందుకోసం వంద మంది వాలంటీర్లను ఎంపిక చేస్తున్నట్లు ఇక్కడి అధికారిక మీడియా ‘గ్లోబల్‌ టైమ్స్‌’ తెలిపింది. అలాగే ఇన్‌ఫ్లూయెంజా, కరోనా వైరస్‌ల నుంచి కూడా ఈ టీకా రక్షణ కల్పించే అవకాశం ఉన్నట్లు వివరించింది. మూడు దశల్లో క్లినికల్‌ పరీక్షలు పూర్తి చేసిన అనంతరం అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించింది. ఇందు కోసం కనీసం ఏడాది సమయం పడుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. మూడు దశల్లో ట్రయల్స్ నిర్వహించి నమ్మకమైన టీకాను అందుబాటులోకి తీసుకువస్తామని చైనా సైంటిస్టులు వెల్లడించినట్లు ఆ మీడియా తెలిపింది. ఇంజెక్షన్లతో పోలిస్తే నాసల్‌ స్ప్రే రూపంలో టీకాను వేయడం చాలా సులువని చెప్పారు. ఈ వ్యాక్సిన తయారీ కూడా తేలికని వారు పేర్కొన్నారు. పైగా దీనివల్ల పెద్దగా సైడ్ ఏఫెక్ట్ లాంటి దుష్ప్రభావాలూ ఉండబోవన్నారు శాస్త్రవేత్తలు.