‘ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణులు వస్తున్నారు.’.చైనా

కోవిడ్-19 మూలాన్ని కనుగొనేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన నిపుణులు తమ దేశాన్ని సందర్శించనున్నారని చైనా ప్రకటించింది. వూహాన్ నుంచే కరోనా వైరస్ పుట్టిందని ఇంచుమించు అన్ని దేశాలూ చైనాపై వేలెత్తి చూపుతున్న..

'ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణులు వస్తున్నారు.'.చైనా
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 09, 2020 | 4:50 PM

కోవిడ్-19 మూలాన్ని కనుగొనేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన నిపుణులు తమ దేశాన్ని సందర్శించనున్నారని చైనా ప్రకటించింది. వూహాన్ నుంచే కరోనా వైరస్ పుట్టిందని ఇంచుమించు అన్ని దేశాలూ చైనాపై వేలెత్తి చూపుతున్న నేపథ్యంలో బీజింగ్ ఈ ప్రకటన చేసింది. తాము వరల్డ్ హెల్త్ సంస్థతో సంప్రదింపులు జరిపామని, కోవిడ్-19 మూలాన్ని కనుగొనడానికి నిపుణుల బృందాన్ని పంపడానికి అంగీకరించిందని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియాన్ తెలిపారు. వైరల్ న్యుమోనియా కేసులపై వూహాన్ మున్సిపల్ కమిషన్ హెల్త్ కమిషన్ నుంచి ఓ స్టేట్ మెంట్ ని చైనాలోని ఈ సంస్థ కార్యాలయం ఆరు నెలల క్రితమే కోరింది. ఇన్నాళ్లకు ఆ బృందాన్ని చైనా ఆహ్వానిస్తోంది. తాము అంతర్జాతీయ నిపుణుల బృందాన్ని సాధ్యమైనంత  త్వరగా పంపడానికి సంబంధించి చైనాతో ఒప్పందం కుదుర్చుకున్నామని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెడ్ టెడ్రోస్ అద్నామ్ గెబ్రెసెస్ గత జనవరిలోనే ప్రకటించారు.