రోజు మిరపకాయలు తింటే మీకా సమస్య ఉండదట..!

మిరపకాయను తలచుకోగానే అందరికీ గుర్తుకొచ్చేది కారపు రుచి, ఘాటు గుర్తుకు వస్తుంది. ఇంటిలో మిరప లేకుండా వంట సాగదు. పచ్చి, పండు, ఎండు మిరపకాయలను మనం ప్రతీ రోజూ వాడుతుంటాం. కానీ, వీటిలో ఆరోగ్యానికి ఉపయోగపడేవి ఎంతగానో ఉన్నాయో మాత్రం తెలియదు. కానీ, అది తెలిస్తే..మీరు ఇక మిరపకాయలను కారం అని అస్సలు అనుకోరు. మిరపకాయలను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా గుండె సంబంధిత సమస్యలు వుండవని వెల్లడించారు ఇటలీ పరిశోధకులు. మిరపకాయలు ఎక్కువగా తీసుకుంటే […]

రోజు మిరపకాయలు తింటే మీకా సమస్య ఉండదట..!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Dec 22, 2019 | 10:59 AM

మిరపకాయను తలచుకోగానే అందరికీ గుర్తుకొచ్చేది కారపు రుచి, ఘాటు గుర్తుకు వస్తుంది. ఇంటిలో మిరప లేకుండా వంట సాగదు. పచ్చి, పండు, ఎండు మిరపకాయలను మనం ప్రతీ రోజూ వాడుతుంటాం. కానీ, వీటిలో ఆరోగ్యానికి ఉపయోగపడేవి ఎంతగానో ఉన్నాయో మాత్రం తెలియదు. కానీ, అది తెలిస్తే..మీరు ఇక మిరపకాయలను కారం అని అస్సలు అనుకోరు.
మిరపకాయలను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా గుండె సంబంధిత సమస్యలు వుండవని వెల్లడించారు ఇటలీ పరిశోధకులు. మిరపకాయలు ఎక్కువగా తీసుకుంటే గుండె పోటు రాకుండా 40 శాతం వరకు తగ్గించవచ్చని వారు పేర్కొన్నారు. అందుచేత రోజుకు రెండేసి మూడేసి మిరపకాయలను వంటల్లో తప్పక చేర్చుకోవాలని పరిశోధకులు చెబుతున్నారు. మిరపకాయల్లో గుండెపోటు వచ్చే ప్రమాదం తగ్గించే ‘క్యాప్‌సేసియన్‌’ అనే పదార్థం ఉంటుందని దీని వల్ల గుండెకు రక్షణ కలుగుతోందని ఇటలీ పరిశోధకులు గుర్తించారు. ఈ వివరాలను‘అమెరికన్‌ కాలేజ్‌ ఆఫ్‌ కార్డియాలజీ’ జర్నల్‌లో ప్రచురించారు. భోజనంలో భాగంగా వారానికి నాలుగుసార్లు మిరపకాయలు తింటే గుండె పోటు ముప్పు 40 శాతం తగ్గుతుందని పరిశోధకులు వెల్లడించారు. దాదాపు 23 వేల మందిపై జరిగిన పరిశోధన ఫలితాల ఆధారంగా వారు ఈ నివేదికను వెల్లడించారు.