తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చలి.. కారణమిదే!

చంపేస్తోంది.. తెలుగు రాష్ట్రాలను చలి చంపేస్తోంది. చలికాలం చివర దశకు వచ్చినా.. విపరీతమైన చలి.. జనాన్ని ఇళ్ల బయటకు రావాలంటేనే భయపడేలా చేస్తోంది. రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయి. వర్షాలకు తోడు వాతావరణ పూర్తిగా మారిపోయింది. తమిళనాడు నుంచి కర్ణాటక మీదుగా ఛత్తీస్‌గఢ్ వరకూ ఉపరితల ద్రోణి ఆవరించి ఉందని అంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఇది కాక మరో ద్రోణి తెలంగాణ మీదుగా ఆవరించి ఉంది. ఈ రెండింటి ప్రభావంతో తెలంగాణలో […]

తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చలి.. కారణమిదే!
Follow us

| Edited By:

Updated on: Feb 10, 2020 | 11:34 AM

చంపేస్తోంది.. తెలుగు రాష్ట్రాలను చలి చంపేస్తోంది. చలికాలం చివర దశకు వచ్చినా.. విపరీతమైన చలి.. జనాన్ని ఇళ్ల బయటకు రావాలంటేనే భయపడేలా చేస్తోంది. రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయి. వర్షాలకు తోడు వాతావరణ పూర్తిగా మారిపోయింది. తమిళనాడు నుంచి కర్ణాటక మీదుగా ఛత్తీస్‌గఢ్ వరకూ ఉపరితల ద్రోణి ఆవరించి ఉందని అంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఇది కాక మరో ద్రోణి తెలంగాణ మీదుగా ఆవరించి ఉంది. ఈ రెండింటి ప్రభావంతో తెలంగాణలో ఎక్కువగా చలి ఉంటోంది. కొన్ని చోట్ల ఉరుములతో కూడిన వర్షాలు పడుతున్నాయని అంటున్నారు వాతావరణ శాఖ అధికారులు.

శీతకాలం చలికి.. ఇప్పటి చలికి తేడా ఉందని అంటున్నారు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు. శీతాకాలంలో మంచు కురవడం వల్ల చలి ఏర్పడుతుంది. కానీ ప్రస్తుతం ఆగ్నేయ దిశ నుంచి తేమ గాలులు వీస్తుండడం వల్ల ఉష్ణోగ్రతలు తగ్గి చల్ల గాలులు వీస్తున్నాయని వారు చెబుతున్నారు. ఈ గాలులతో జాగ్రత్తగా ఉండాలని, అందులోనూ ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న దృష్ట్యా ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని అధికారులు పేర్కొంటున్నారు.

కాగా.. తెలంగాణలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం జిల్లాల్లో జోరుగా వర్షం కురిసింది. ఈ అకాల వర్షానికి అన్నదాతలు నష్టపోతున్నారు. ముఖ్యంగా మిర్చి, పత్తి, వరి, వేరుశనగ, మొక్కజొన్న పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. వేల ఎకరాల్లోని పంట తడిసి ముద్దైంది. అమ్ముకునే సమయానికి.. వర్షం వల్ల పంట నీట మునగడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.