చిలీలో కార్గో ఫ్లైట్‌ మిస్సింగ్‌..సముద్రంలో విమాన శకలాలు

రెండ్రోజుల క్రితం అదృశ్యమైన చిలీ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన సీ-130 కార్గో విమానం శకలాలను గుర్తించారు అధికారులు. విమానంతో సంబంధాలు తెగిపోయిన ప్రాంతానికి 30 కిలోమీటర్ల దూరంలో ఫ్లైట్‌కు సంబంధించిన స్పాంజ్‌ పదార్థాన్ని గుర్తించినట్లు ప్రకటించారు వైమానిక దళ అధికారి జనరల్‌ ఎడ్వర్డో మోస్క్వైరా. డ్రేక్‌ పాస్‌ సముద్ర ప్రాంతం మీదుగా వెళ్తున్న క్రమంలో కంట్రోల్‌ విభాగంతో సంబంధాలు కట్‌ అయ్యాయని..ఆ తర్వాత సముద్రంలో కూలిపోయి ఉంటుందని భావిస్తున్నామన్నారు.  ఐతే శకలాలపై పరిశోధన చేసిన తర్వాతే అవి ఏ […]

చిలీలో కార్గో ఫ్లైట్‌ మిస్సింగ్‌..సముద్రంలో విమాన శకలాలు
Follow us

|

Updated on: Dec 12, 2019 | 1:04 PM

రెండ్రోజుల క్రితం అదృశ్యమైన చిలీ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన సీ-130 కార్గో విమానం శకలాలను గుర్తించారు అధికారులు. విమానంతో సంబంధాలు తెగిపోయిన ప్రాంతానికి 30 కిలోమీటర్ల దూరంలో ఫ్లైట్‌కు సంబంధించిన స్పాంజ్‌ పదార్థాన్ని గుర్తించినట్లు ప్రకటించారు వైమానిక దళ అధికారి జనరల్‌ ఎడ్వర్డో మోస్క్వైరా. డ్రేక్‌ పాస్‌ సముద్ర ప్రాంతం మీదుగా వెళ్తున్న క్రమంలో కంట్రోల్‌ విభాగంతో సంబంధాలు కట్‌ అయ్యాయని..ఆ తర్వాత సముద్రంలో కూలిపోయి ఉంటుందని భావిస్తున్నామన్నారు.  ఐతే శకలాలపై పరిశోధన చేసిన తర్వాతే అవి ఏ విమానానికి చెందినవో అధికారికంగా ప్రకటిస్తామని తెలిపారు.

గత సోమవారం చిలీలోని పుంటా ఏరినాస్‌ నగరం నుంచి బయలుదేరిన సీ-130  హెర్క్యులస్‌ విమానం అటార్కిటికా వెళ్లాల్సి ఉంది. ఐతే మార్గమధ్యంలో కనిపించకుండా పోయింది అప్పటినుంచి వైమానిక విమానం కోసం తనిఖీలు చేపట్టిన అధికారులు..సముద్రంలో శకలాలను గుర్తించారు. ఫ్లైట్‌ మిస్సైన సమయంలో 17 మంది సిబ్బందితో పాటు 21 మంది ప్రయాణికులున్నారు. వారి కుటుంబసభ్యులు..తమ వారి కోసం దక్షిణ చిలీ నగరం పుంటా ఏరినాస్‌కు చేరుకున్నారు.Chile missing C-130 plane: Floating debris found