ఆపన్న హస్తం కోసం..

సిద్దిపేటః  రెక్కాడితే గానీ, డొక్కాడని కుటుంబంలో ముగ్గురూ లేవలేని వారే. పాతికేళ్లు దాటినా కనీసం పట్టుమని పది అడుగులు కూడా సురక్షితంగా వేయలేని ఇద్దరు సంతానం, పక్షవాతంతో మంచానికి పరిమితమైన ఇంటి యజమాని ఈ ముగ్గురిని కంటికి రెప్పల్లా కాపాడేందుకు రెక్కలు ముక్కలు చేసుకుంటున్న ఆ ఇల్లాలి వేదన అంతాఇంతా కాదు. విధి ఆడిన వింత నాటకంలో నిండుకుటుంబం పావులుగా మారింది. ఒకే ఫ్యామిలో ముగ్గురు విగతజీవులుగా మిగిలారు.. విధి చేతిలో వంచితులైన ఓ నిరుపేద కుటుంబం […]

ఆపన్న హస్తం కోసం..
Follow us

| Edited By: Srinu

Updated on: Nov 16, 2019 | 5:44 PM

సిద్దిపేటః  రెక్కాడితే గానీ, డొక్కాడని కుటుంబంలో ముగ్గురూ లేవలేని వారే. పాతికేళ్లు దాటినా కనీసం పట్టుమని పది అడుగులు కూడా సురక్షితంగా వేయలేని ఇద్దరు సంతానం, పక్షవాతంతో మంచానికి పరిమితమైన ఇంటి యజమాని ఈ ముగ్గురిని కంటికి రెప్పల్లా కాపాడేందుకు రెక్కలు ముక్కలు చేసుకుంటున్న ఆ ఇల్లాలి వేదన అంతాఇంతా కాదు. విధి ఆడిన వింత నాటకంలో నిండుకుటుంబం పావులుగా మారింది. ఒకే ఫ్యామిలో ముగ్గురు విగతజీవులుగా మిగిలారు.. విధి చేతిలో వంచితులైన ఓ నిరుపేద కుటుంబం దీనగాధ.

సిద్దిపేట జిల్లా దుబ్బాకకు చెందిన తుమ్మ చంద్రమౌలి, శ్యామల దంపతులది కడు పేదకుటుంబం. రెక్కాడితే గానీ, డొక్కాడని పరిస్థితి. వీరికి ముగ్గురు సంతానం. శ్యామల బీడీలు చుడితే, చంద్రమౌలి బీడీ కంపెనీలో కూలి పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. కానీ, విధి వీరిని చిన్నచూపు చూసింది. వీరికి పుట్టిన ముగ్గురు పిల్లల్లో ఇద్దరు బుద్దిమాంద్యులు. పాతికేళ్లు దాటినా సరిగా మాట్లాడలేరు, కుదురుగా నిల్చుని, నడవనూలేరు, అంతే కాదు, స్వతహాగా తమ పనులు కూడా తాము చేసుకునే పరిస్థితి లేదు. ఇద్దరినీ తల్లి శ్యామల దగ్గరుండి చూసుకుంటుంది. అయితే, వీరు పుట్టిన ఏడాది వరకు బాగానే ఉన్నారని, ఆ తర్వాతే ఏదో వింతరోగం సోకిందని, దాంతో వారు ఏం చేస్తారో వారికే తెలియదని అంటున్నారు. పిల్లలకు చికిత్స చేయించేందుకు గానూ వారికున్న కొద్దిపాటి పొలాన్ని కూడా అమ్మేసి వైద్యం కోసం ఖర్చు చేసిన ఫలితం లేకుండా పోయిందని ఆ తల్లిదండ్రులు వాపోతున్నారు.

అంతలోనే ఆ కుటుంబంపై మరో పిడుగు పడింది. చెట్టంత ఎదిగిన పిల్లల్ని చంటిబిడ్డలా చూడాల్సి రావటంతో ఆ తండ్రి తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. బీడీ ఫ్యాక్టరీలోనే  కుప్పకూలాడు. హై బీపీ కారణంగా పక్షవాతం వచ్చి కాళ్లుచేతులు చచ్చుపడిపోయాయి. దీంతో చంద్రమౌలి కూడా మంచానికే పరిమితం కావాల్సి వచ్చింది. ఆర్థికంగా ఎటువంటి ఆసరా లేని శ్యామల ముగ్గురు అభ్యాగులను తన రెక్కల కష్టంపైనే సాకుతోంది. తండ్రి, కూతురు,కొడుకు ముగ్గురు రోగులతో సతమతమవుతున్నానంటూ కన్నీటి పర్యంతమవుతోంది. సరైన వైద్యం అందించలేక, కనీసం కడుపునిండా తిండి కూడా పెట్టలేక నరకయాతన అనుభవిస్తున్నానంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తుంది. శ్యామల, చంద్రమైలి దీనస్థితికి స్థానికులు సైతం చలించిపోతున్నారు. వీరి పరిస్థితి మరే కుటుంబానికి రాకూడదని సంతాపం వ్యక్తం చేస్తున్నారు. దాతలేవరైనా ముందుకు వచ్చిన శ్యామల, చంద్రమౌలి కుటుంబాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వీరికి తగిన ఆర్థిక సాయం అందలని మనమూ ఆశిద్దాం…

కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
శరీరంలో కనిపించే ఈ లక్షణాలు.. కిడ్నీల్లో రాళ్లకు సంకేతం కావొచ్చు.
శరీరంలో కనిపించే ఈ లక్షణాలు.. కిడ్నీల్లో రాళ్లకు సంకేతం కావొచ్చు.
బంగారం రా మా సాయి పల్లవి.. ఇంత మెచ్యురిటీ ఏంటమ్మా నీకు..
బంగారం రా మా సాయి పల్లవి.. ఇంత మెచ్యురిటీ ఏంటమ్మా నీకు..