లోయలో పడ్డ బస్సు.. ఏడుగురు చిన్నారులు మృతి

children killed as school van falls into gorge in Uttarakhand, లోయలో పడ్డ బస్సు.. ఏడుగురు చిన్నారులు మృతి

ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. థెహ్రీ గర్వాల్ పట్టణ సమీపంలో ఓ స్కూల్ బస్సు ప్రమాదానికి గురైంది. కన్గసాలీ గ్రామ సమీపంలో ఓ మలుపు వద్ద అదుపుతప్పి లోయలో పడింది. ఈ ఘటనలో ఏడుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోగా.. మరో పదకొండు మంది తీవ్ర గాయాలపాలయ్యారు. ప్రమాద సమయంలో బస్సులో 18 మంది చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న ఎస్డీఆర్ఎఫ్ టీం ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *