ఎర్రకోట వద్ద చిక్కుబడిపోయిన పిల్లలు, కళాకారులను రక్షించిన పోలీసులు, 2 గంటలపాటు భయం, భయం

ఢిల్లీలో నిన్న రెడ్ ఫోర్ట్ వద్ద రైతుల నిరసన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. వారి ముట్టడితో ఆ ప్రాంతమంతా భీతావహంగా మారింది. గణ తంత్ర దినోత్సవం సందర్భంగా జరిగే..

ఎర్రకోట వద్ద చిక్కుబడిపోయిన పిల్లలు, కళాకారులను రక్షించిన పోలీసులు, 2 గంటలపాటు భయం, భయం
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 27, 2021 | 1:34 PM

ఢిల్లీలో నిన్న రెడ్ ఫోర్ట్ వద్ద రైతుల నిరసన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. వారి ముట్టడితో ఆ ప్రాంతమంతా భీతావహంగా మారింది. గణ తంత్ర దినోత్సవం సందర్భంగా జరిగే సాంస్కృతిక ప్రదర్శనలో పాల్గొనేందుకు అక్కడికి చేరుకున్న పిల్లలు, సుమారు 200 మంది కళాకారులు ఆ సందర్భంలో ఎటూ పోలేక అక్కడే చిక్కుబడిపోయారు.  పెద్ద సంఖ్యలో రెడ్ ఫోర్ట్ వద్దకు కత్తులు, కటార్లతో దూసుకువచ్చిన రైతులను పోలీసులు కూడా అడ్డుకోలేక పోయారు. దీంతో  తమను అక్కడి నుంచి రక్షించే వారు కనబడక ఈ పిల్లలు, ఆర్టిస్టులు భయంతో బిక్కుబిక్కుమంటూ గడిపారు. దాదాపు రెండు గంటలపాటు వారు నరకం వంటి పరిస్థితిని అనుభవించారు. చివరకు అదనపు బలగాలతో పోలీసులు అక్కడికి చేరి వారిని సురక్షితంగా తరలించారు. తాము ఇంతటి ఉద్రిక్తమైన, భీతావహ పరిస్థితిని ఎదుర్కొంటామని వారు ఏ మాత్రం ఊహించలేకపోయారు.