పొదుపు సంఘాలకు సీఎం చేయూత.. ‘‘సున్నా వడ్డీ’’

లాక్‌డౌన్ పీరియడ్‌తో వ్యాపారాలు ముందుకు సాగక తీవ్ర ఇబ్బందులు పడుతున్న పొదుపు సంఘాలకు చేయూతనిచ్చేందుకు ఏపీ ప్రభుత్వం సరికొత్త పథకాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ మేరకు బుధవారం అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.

పొదుపు సంఘాలకు సీఎం చేయూత.. ‘‘సున్నా వడ్డీ’’
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Apr 22, 2020 | 1:30 PM

లాక్‌డౌన్ పీరియడ్‌తో వ్యాపారాలు ముందుకు సాగక తీవ్ర ఇబ్బందులు పడుతున్న పొదుపు సంఘాలకు చేయూతనిచ్చేందుకు ఏపీ ప్రభుత్వం సరికొత్త పథకాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ మేరకు బుధవారం అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఈ తాజా నిర్ణయంతో జీవనోపాధికి తీసుకున్న రుణాలకు వడ్డీ చెల్లించలేని పొదుపు సంఘాలకు ఎంతో ఊరట లభించనున్నది.

కరోనా కష్ట సమయంలో “వైయస్ఆర్ సున్నా వడ్డీ పథకం” భరోసానిచ్చేందుకు ఏపీ ప్రభుత్వం రెడీ అయ్యింది. పొదుపు సంఘాలు చెల్లించాల్సిన మొత్తం వడ్డీని ప్రభుత్వమే భరించనున్నది. తాజా లెక్కల ప్రకారం వడ్డీ భారం 1400 కోట్ల రూపాయలుండగా.. దాన్ని పూర్తిగా ప్రభుత్వమే భరించనున్నది. ఏప్రిల్ 24వ తేదీన “వైయస్ఆర్ సున్నా వడ్డీ పథకం”ను ప్రారంభించనున్నారు సీఎం వైఎస్ జగన్.

పొదుపు సంఘాలకు ఇవ్వనున్న వడ్డీ రాయితీ మొత్తాన్ని లాంఛనంగా బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 93 లక్షల మంది పొదుపు సంఘాల మహిళలకు లబ్ధి చేకూరుతుంది. అధికారంలోకి రాగానే సున్నావడ్డీకి రుణాలు ఇప్పిస్తామని జగన్ గతంలోనే హామీ ఇచ్చారు. దాన్నిపుడు కరోనా కష్టకాలంలో అమల్లోకి తెచ్చారు. రాష్ట్రంలో అర్బన్ ప్రాంతాల్లో 1.83 లక్షల సంఘాలు, రూరల్ ఏరియాలో 6.95 లక్షల సంఘాలుండగా.. వాటన్నటికీ ఈ నిర్ణయం ప్రయోజనం కలిగించనున్నది.