పంటల కొనుగోలుపై సీఎం కేసీఆర్ ఈ రోజు కీలక సమీక్ష

వానకాలం పంటల కొనుగోలుపై  సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్న 2.30గంటలకు ప్రగతి భవన్‌లో  అధికారులతో వ్యవసాయం, పంటలు అనే అంశంపై సమీక్ష జరుగనుంది.

  • Sanjay Kasula
  • Publish Date - 9:27 am, Fri, 23 October 20

Cm KCR Review Meeting : తెలంగాణ రైతులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు శుభవార్త చెప్పనున్నారు. వానకాలం పంటల కొనుగోలుపై  సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్న 2.30గంటలకు ప్రగతి భవన్‌లో  అధికారులతో వ్యవసాయం, పంటలు అనే అంశంపై సమీక్ష జరుగనుంది. ఈ సమావేశంలో ముఖ్యంగా పంటల కొనుగోలు, యాసంగిలో నిర్ణీత పంటల సాగు విధానంపై సీఎం చర్చించనున్నారు. సమావేశానికి వ్యవసాయశాఖ, పౌరసరఫరాలు, మార్కెటింగ్‌శాఖ మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆయాశాఖల ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.

వానాకాలం పంటల కొనుగోలు కోసం రాష్ట్రవ్యాప్తంగా చేసిన ఏర్పాట్లు, యాసంగిలో పంటల సాగుపై సీఎం చర్చింనున్నారు.  ముఖ్యంగా మక్కల సాగుపై విధానపరమైన నిర్ణయం తీసుకోనున్నారు. సమగ్ర వివరాలతో సమావేశానికి రావాల్సిన అధికారులను ఇప్పటికే ఆదేశించారు.

గతేడాది ఎన్ని ఎకరాల్లో పంటలు వేశారు?.. ఎంత ధర వచ్చింది? తెలుపాలని, యాసంగి మక్కల సాగులో లాభమా..నష్టామా? ఈ ఏడాది కురిసన వర్షాలు..? వర్షాల ప్రభావం పంటలపై ఎలా ఉంది..?  ప్రస్తుత మార్కెట్‌పై మంత్రులు, అధికారులతో సీఎం చర్చించనున్నారు.