ప్రధాని మోదీజీ ఆదుకోండి…

భారీ వర్షాల కారణంగా ఐదు వేల కోట్ల నష్టం జరిగిందని, తక్షణ సాయంగా 1350 కోట్ల సాయం చేయాలని ప్రధానికి తెలంగాణ సీఎం కేసీఆర్ లేఖ రాశారు. ప్రాథమిక అంచనాల మేరకు ఐదు వేల కోట్ల..

ప్రధాని మోదీజీ ఆదుకోండి...
Follow us

|

Updated on: Oct 15, 2020 | 5:19 PM

భారీ వర్షాల కారణంగా ఐదు వేల కోట్ల నష్టం జరిగిందని, తక్షణ సాయంగా 1350 కోట్ల సాయం చేయాలని ప్రధానికి తెలంగాణ సీఎం కేసీఆర్ లేఖ రాశారు. ప్రాథమిక అంచనాల మేరకు ఐదు వేల కోట్ల వరకు నష్టం జరిగిందన్నారు. పునరావాస చర్యల కోసం సాయం చేయాలని కేంద్రాన్ని కోరారు. తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

వర్షం విపత్తు, సహాయక కార్యక్రమాలు, పంటల పరిస్థితులు, నష్టం అంచనాపై అధికారలను అడిగి తెలుసుకుంటున్నారు. ప్రగతి భవన్ లో జరిగిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశానికి  మంత్రులు కేటీఆర్, దయాకర్ రావు, ప్రశాంత్ రెడ్డి, జగదీష్ రెడ్డి, శ్రీనివాస్ యాదవ్, మహమూద్ ఆలి, నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. వారితోపాటు సీఎస్ సోమేశ్ కుమార్, జీహెచ్ఎంసీ అధికారులు, విధ్యుత్, వ్యవసాయశాఖ అధికారులు ఉన్నారు. తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై అడిగి తెలుసుకున్నారు.