నేడు స్వగ్రామానికి సీఎం కేసీఆర్

తెలంగాణ సీఎం కేసీఆర్ సోమవారం తన సొంతగ్రామం చింతమడక పర్యటనకు వెళ్లనున్నారు. ఆయన పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసారు. సీఎం కేసీఆర్ ఉదయం 10.30 గంటలకు చింతమడక గ్రామానికి చేరుకుంటారు.ఇది కేవలం సీఎం కేసీఆర్ సొంతూరు గ్రామస్థులతో మమేకమయ్యే పర్యటన అయినందున ఇతరులెవరినీ అనుమతించడం లేదు. ముఖ్యమంత్రి గ్రామంలో కలియదిరుగుతారు. ఈ సందర్భంగా గ్రామస్థులతో ఆత్మీయ సమావేశం, సహపంక్తి భోజనాలకు ఏర్పాట్లుచేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ బీసీ రెసిడెన్షియల్ పాఠశాలకు శంకుస్థాపన చేయడంతోపాటు […]

నేడు స్వగ్రామానికి  సీఎం కేసీఆర్
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Jul 22, 2019 | 7:28 AM

తెలంగాణ సీఎం కేసీఆర్ సోమవారం తన సొంతగ్రామం చింతమడక పర్యటనకు వెళ్లనున్నారు. ఆయన పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసారు. సీఎం కేసీఆర్ ఉదయం 10.30 గంటలకు చింతమడక గ్రామానికి చేరుకుంటారు.ఇది కేవలం సీఎం కేసీఆర్ సొంతూరు గ్రామస్థులతో మమేకమయ్యే పర్యటన అయినందున ఇతరులెవరినీ అనుమతించడం లేదు. ముఖ్యమంత్రి గ్రామంలో కలియదిరుగుతారు. ఈ సందర్భంగా గ్రామస్థులతో ఆత్మీయ సమావేశం, సహపంక్తి భోజనాలకు ఏర్పాట్లుచేశారు.

ఈ సందర్భంగా కేసీఆర్ బీసీ రెసిడెన్షియల్ పాఠశాలకు శంకుస్థాపన చేయడంతోపాటు డబుల్ బెడ్‌రూం ఇండ్లను ప్రారంభిస్తారు. కేసీఆర్ చింతమడక గ్రామస్తులతో సమావేశం కానున్నారు.దీనికి హాజరయ్యే 3200 మంది గ్రామస్థులకు ప్రత్యేకంగా తయారుచేయించిన పింక్ కలర్ ఐడీ కార్డులను అందించారు. సీఎం కేసీఆర్ ఆత్మీయులతో కలిసి భోజనం చేయడానికి పెద్దమ్మ గుడి పక్కనే రెయిన్‌ప్రూఫ్ టెంట్ సిద్ధం చేశారు. మొత్తం ఆరువేల మందికి ఇక్కడ భోజనాలను ఏర్పాటుచేస్తున్నారు.

సీఎం కేసీఆర్‌ స్వగ్రామానికి రానున్న నేపథంలో ఆయనకు ఘనస్వాగతం పలుకడానికి చింతమడక గ్రామమంతా పండుగ వాతావరణం నెలకొంది. గ్రామప్రజలు ఇండ్లను శుభ్రం చేసుకొని మామిడి తోరణాలు కట్టుకొని అలంకరించుకున్నారు. గ్రామంలోని ప్రధాన రహదారులకు ఇరువైపులా హరితహారం మొక్కలు నాటారు.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..