Breaking News
  • సికింద్రాబాద్‌-మచిలీపట్నం మధ్య ప్రత్యేక రైళ్లు. డిసెంబర్‌ 1,8,15,22,29 తేదీల్లో నడవనున్న ప్రత్యేక రైళ్లు. మచిలీపట్నంలో మధ్యాహ్నం 2:25కి బయల్దేరి.. రాత్రి 10:10కి సికింద్రాబాద్‌కు చేరుకోనున్న ప్రత్యేక రైలు. అదేరోజు సికింద్రాబాద్‌ నుంచి రాత్రి 11:55కి బయల్దేరి.. మరుసటి రోజు ఉ.8:55కి మచిలీపట్నం చేరుకోనున్న ప్రత్యేక రైలు.
  • ఏపీకి నెంబర్లు కేటాయించిన కేంద్రం. అక్రమ మైనింగ్‌, అనధికార మద్యం అమ్మకాలపై.. ఫిర్యాదులకు నెంబర్లు కేటాయించిన కేంద్ర సర్కార్‌. అక్రమ మైనింగ్‌పై ఫిర్యాదు కోసం 14400 నెంబర్‌.. అనధికార మద్యంపై ఫిర్యాదుకు 14500 నెంబర్‌ కేటాయింపు.
  • మళ్లీ పెరిగిన బంగారం ధరలు. పెళ్లిళ్ల సీజన్‌ కొనుగోళ్లతో పెరిగిన పసిడి ధరలు. 10గ్రాముల 24క్యారెట్ల బంగారంపై రూ.225 పెంపు. రూ.38,715 పలుకుతున్న 10గ్రాముల బంగారం. రూ.440 పెరిగి రూ.45,480కి చేరిన కిలో వెండి ధర.
  • ఛండీగడ్‌: 2019 ప్రపంచ కబడ్డీ కప్‌కు పంజాబ్ ఆతిథ్యం. డిసెంబర్‌ 1 నుంచి 9 వరకు మ్యాచ్‌ల నిర్వహణ. సుల్తాన్‌పూర్‌ లోధిలోని గురునానక్‌ స్టేడియంలో ప్రారంభ వేడుక. ప్రపంచ కబడ్డీ టోర్నీలో పాల్గొననున్న భారత్, అమెరికా, శ్రీలంక.. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, కెన్యా, న్యూజిలాండ్‌, పాకిస్తాన్‌, కెనడా జట్లు.
  • ఓటర్ల జాబితా సవరణకు కొత్త షెడ్యూల్‌ విడుదల. జనవరి 1, 2020 అర్హత తేదీతో ఓటర్ల జాబితా సవరణ. ఓటర్ల వివరాల పరిశీలనకు ఈనెల 30 తుది గడువు. డిసెంబర్‌ 16న ఓటర్ల జాబితా ముసాయిదా ప్రచురణ. 2020, జనవరి 15న అభ్యంతరాలు, వినతుల స్వీకరణ.
  • టిక్‌టాక్‌కు పోటీగా త్వరలో ఇన్‌స్టాగ్రామ్‌ కొత్త ఫీచర్‌. రీల్స్‌ పేరిట ఓ కొత్త ఫీచర్‌ అందుబాటులోకి. ఇన్‌స్టాగ్రామ్‌లోని ఎక్స్‌ప్లోర్‌ సెక్షన్‌లో కొత్త ఫీచర్. కొత్త ఫీచర్‌లో టిక్‌టాక్ మాదిరిగా వీడియోలు క్రియేట్‌ చేసే సౌకర్యం.

నాలుగు కిలోలు తగ్గిన చిదంబరం… కారణం ఎంటో తెలుసా..?

ఐఎన్ఎక్స్ కేసులో నిందితుడుగా ఉన్న కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పీ. చిదంబరం (74) బరువు తగ్గుతున్నారు. గత నెలరోజులుగా ఆయన 4కిలోలు బరువు తగ్గారు. దానికి కారణం ప్రస్తుతం ఆయన తినే ఆహారమే. ప్రస్తుతం జ్యూడీషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైలులో ఉన్న ఆయనకు రోజు జైలులో పెట్టే ఆహారం పడటం లేదు. అయితే తొలుత ఆహార విషయానికి సంబంధించి తనకు వెసులుబాటు కల్పించాలని కోర్టుకు విన్నవించుకున్నారు. కోర్టు ఆయన అభ్యర్థనను సున్నితంగా తిరస్కరించింది. అయితే ఈ నేపథ్యంలో ఆయన జైలు ఆహారం పడకపోవడంతో అనారోగ్యానికి గురై.. నాలుగు కిలోల మేరా బరువు తగ్గారు. ఈ విషయంపై చిదంబరం తరఫు న్యాయవాది.. ఆహారం విషయంలో ఇంటినుంచి తెచ్చుకునేందకు వెసులుబాటు కల్పించాలని  గురువారం సీబీఐ కోర్టును మరోసారి అభ్యర్థించారు. న్యాయవాది అభ్యర్థనను ఈ సారి కోర్ట్ అంగీకరించింది. ఇంటి నుంచి తెచ్చిన భోజ‌నాన్ని తినేందుకు ప‌ర్మిష‌న్ ఇచ్చింది. అంతేకాదు ఇక వైద్య స‌దుపాయం కోసం బ‌య‌ట ఆస్ప‌త్రుల‌కు వెళ్లేందుకు కూడా కోర్టు అనుమతి ఇచ్చింది.

కాగా, బెయిల్ ఇవ్వాలంటూ గురువారం చిదంబ‌రం సుప్రీంను ఆశ్ర‌యించారు. ఆయన త‌ర‌ఫున సీనియ‌ర్ న్యాయ‌వాది క‌పిల్ సిబ‌ల్ కోర్టులో అఫిడ‌విట్ దాఖ‌లు చేశారు. ఈ నేపథ్యంలో బెయిల్‌ పిటిషన్‌పై అభిప్రాయాన్ని చెప్పాలంటూ శుక్రవారం సీబీఐకి సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసింది. తనకు బెయిల్‌ మంజూరు చేయాలంటూ చిదంబరం తొలుత ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయగా కోర్టు తోసిపుచ్చింది. దీంతో ఆయన సుప్రీంకోర్టులో బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ ఆర్‌ బానుమతి, జస్టిస్‌ రిషికేశ్‌ రాయ్‌ విచారణ జరిపారు.