పేడ ధర పెంపు ! ..”గోధన్‌ న్యాయ్’ యోజనకు కేబినెట్ ఆమోదం..

జూన్‌ 25 నుంచి "గోధన్‌ న్యాయ్‌' పథకంలో భాగంగా ఆవు పేడను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, గతంలో కిలో ఆవు పేడకు రూ. 1.5గా నిర్ణయించిన ప్రభుత్వం.. తాజాగా పేడ ధరను పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

పేడ ధర పెంపు ! ..గోధన్‌ న్యాయ్' యోజనకు కేబినెట్ ఆమోదం..
Follow us

|

Updated on: Jul 15, 2020 | 2:12 PM

ఆవుపేడను కొనుగోలు చేసేందుకు చత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం ఇటీవలే కార్యాచరణ సిద్ధం చేసింది. జూన్‌ 25 నుంచి “గోధన్‌ న్యాయ్‌’ పథకంలో భాగంగా ఆవు పేడను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, గతంలో కిలో ఆవు పేడకు రూ. 1.5గా నిర్ణయించిన ప్రభుత్వం.. తాజాగా పేడ ధరను పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

చత్తీస్‌గఢ్‌ రాష్ట్ర ప్రభుత్వ రైతులు, గోశాలల నుంచి ఆవు పేడను కొనుగోలు చేస్తోంది. అందుకోసం కిలో 2 రూపాయల చొప్పున కొనుగోలు చేయాలని ఛత్తీస్ ఘడ్ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. గోధ న్యాయ్‌ పథకం కింద సహకార సంఘాల ద్వారా సేకరించిన పేడతో వర్మీకంపోస్టును తయారు చేస్తోంది. తిరిగి తయారైన వర్మీ కంపోస్టును రైతులకు కిలో 8 రూపాయల చొప్పున విక్రయించాలని సర్కారు నిర్ణయించింది. వర్మీకంపోస్టు తయారీకి సహకార సంఘాల ద్వారా రుణాలు ఇప్పించాలని భావించిన ప్రభుత్వం.. సేంద్రీయ వ్యవసాయ పద్ధతులను అవలంభించడం ద్వారా కొత్తగా గ్రామీణులకు ఉపాధి కల్పించే దిశగా చర్యలు చేపట్టింది.