అప్పుడే గరం గరంగా ఏపీ అసెంబ్లీ.. నేతల మధ్య మాటల యుద్ధం!

ఏపీ అసెంబ్లీలో రచ్చ మొదలైంది. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం ప్రారంభమైంది. మొదట జగన్, చంద్రబాబు మధ్య మొదలైన రచ్చ క్రమంగా వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి.. చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలతో సభలో తీవ్ర దుమారం రేగింది. స్పీకర్ తమ్మినేని సీతారాంకు అభినందనలు తెలిపేందుకు చంద్రబాబు రాకుండా ఆయన బంట్రోతు అచ్చెన్నాయుడును పంపారని చెవిరెడ్డి వ్యాఖ్యానించారు. దీనితో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలపై టీడీపీ సభ్యులు నిరసనకు దిగారు. అటు […]

అప్పుడే గరం గరంగా ఏపీ అసెంబ్లీ.. నేతల మధ్య మాటల యుద్ధం!
Follow us

| Edited By:

Updated on: Jun 14, 2019 | 12:17 PM

ఏపీ అసెంబ్లీలో రచ్చ మొదలైంది. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం ప్రారంభమైంది. మొదట జగన్, చంద్రబాబు మధ్య మొదలైన రచ్చ క్రమంగా వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి.. చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలతో సభలో తీవ్ర దుమారం రేగింది. స్పీకర్ తమ్మినేని సీతారాంకు అభినందనలు తెలిపేందుకు చంద్రబాబు రాకుండా ఆయన బంట్రోతు అచ్చెన్నాయుడును పంపారని చెవిరెడ్డి వ్యాఖ్యానించారు. దీనితో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలపై టీడీపీ సభ్యులు నిరసనకు దిగారు.
అటు అచ్చెన్నాయుడు కూడా.. తాను శాసనసభ్యుడినా..? లేక బంట్రోతునా అనేది తేల్చాలంటూ స్పీకర్ ను కోరారు. ఒకవేళ తాను బాబు బంట్రోతునైతే.. వైసీపీ సభ్యులంతా జగన్ బంట్రోతులా అంటూ విమర్శించారు. దీనితో సభలో అధికార, విపక్ష పార్టీల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఉద్దేశపూర్వకంగా చెవిరెడ్డి వ్యాఖ్యలు చేయలేదని చెప్పుకొచ్చారు. బంట్రోతుల్లా.. అనే పదం వాడారని శ్రీకాంత్‌రెడ్డి స్పష్టం చేశారు.
అధికారపార్టీ.. మమ్మల్ని పిలవలేదు – బాబు
స్పీకర్ ఎన్నికపై తమకు ఒక్క మాట కూడా చెప్పలేదని.. అలాంటిది తాను స్పీకర్ చైర్ స్థానం వరకు ఎలా వస్తానని చంద్రబాబు ప్రశ్నించారు. ఇకపోతే అచ్చెన్నాయుడుపై చెవిరెడ్డి చేసిన వ్యాఖ్యలు బాధాకరమని బాబు అన్నారు. ఆయన వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా ఈ దుమారంపై టీడీపీ ఎమ్మెల్యేలు సభలోనే ఆందోళన కొనసాగిస్తుంటే.. వైసీపీ ఎమ్మెల్యేలు మాత్రం వారిపై కౌంటర్ల వర్షం కురిపించారు.
బంట్రోతు అంటే సేవకుడు – చెవిరెడ్డి
తానేమీ ఉద్దేశపూర్వకంగా అచ్చెన్నాయుడును బంట్రోతు అని వ్యాఖ్యానించలేదని చెవిరెడ్డి స్పష్టం చేశారు. బంట్రోతు అంటే సేవకుడని.. దానిలో తప్పేమి ఉందని ఆయన ప్రశ్నించారు. ఇకపోతే గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డిని నరరూప రాక్షసుడని టీడీపీ వారు విమర్శించారని.. అప్పటి వ్యాఖ్యలకు వారు క్షమాపణ చెబితే.. తాను కూడా క్షమాపణ చెబుతానని ఆయన అన్నారు.

దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!