పెళ్లి కూతురు, పెళ్లికొడుకులకు గిఫ్ట్‌గా హెల్మట్..!

Chennai wedding guests get helmets as gifts, పెళ్లి కూతురు, పెళ్లికొడుకులకు గిఫ్ట్‌గా హెల్మట్..!

ద్విచక్ర వాహన నిబంధనలు అమల్లోకి రావటంతో.. వాహదారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్న సంగతి తెలిసిందే. ఇదే ఇప్పుడు స్నేహితుడి వివాహంలో కూడా చర్చగా మారింది. తన స్నేహితుని వివాహం సందర్బంగా హెల్మెట్ బహుకరించి అటు నిబంధనలతో పాటు స్నేహ ధర్మాన్ని పాటించారు. చెన్నైలోని ఆవడిలోని ఓ కళ్యాణ మండపంలో మోహన్, విశాలి వివాహం ఘనంగా జరిగింది. ఈ వివాహానికి వచ్చిన అతిథులంతా వారికి నచ్చిన బహుమతులు బహురించారు. అదేవిధంగా వివాహానికి హాజరైన వధూవరుల స్నేహితులందరూ కలిసి.. పెళ్లి కూతురు, పెళ్లికొడుకులకు వాహన నిబంధనలపై అవగాహన జరిపి ఇరువురికి రెండు హెల్మెట్‌లు బహుకరించారు. అంతేకాదు ఇరువురికి హెల్మెట్లు పెట్టి ఫొటోలు దిగి సందడి చేశారు. ఈ ఘటన వాహనదారులనే కాదు వివాహానికి హాజరైన అతిధులు, బంధుమిత్రులను ఆలోచింపచేసింది.

Chennai wedding guests get helmets as gifts, పెళ్లి కూతురు, పెళ్లికొడుకులకు గిఫ్ట్‌గా హెల్మట్..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *