“డూ ఆర్ డై”..ఈ ఇద్దరికి గెలుపే కీలకం

ఇది డూ ఆర్ డై సమయం.. ఇప్పటివరకూ ఒక మ్యాచ్‌ ఓడినా.. మరో మ్యాచ్‌లో‌ చూసుకోవచ్చు అనేది ఉండేది. కానీ.. ఇప్పుడు మొత్తం మారిపోయింది. గెలిచిన జట్టు ముందుకు వెళితే.. ఓడిన జట్టు ఇంటికి వెళ్లాల్సిందే. ఇక ప్రతి పాయింట్‌ కీలకమే. రన్‌రేట్‌ కూడా తెరపైకి వచ్చి ప్లేఆఫ్స్ జట్లను ఖరారు చేసే పరిస్థితులు సమీపించింది....

డూ ఆర్ డై..ఈ ఇద్దరికి గెలుపే కీలకం
Follow us

|

Updated on: Oct 19, 2020 | 6:11 PM

ఇది డూ ఆర్ డై సమయం.. ఇప్పటివరకూ ఒక మ్యాచ్‌ ఓడినా.. మరో మ్యాచ్‌లో‌ చూసుకోవచ్చు అనేది ఉండేది. కానీ.. ఇప్పుడు మొత్తం మారిపోయింది. గెలిచిన జట్టు ముందుకు వెళితే.. ఓడిన జట్టు ఇంటికి వెళ్లాల్సిందే. ఇక ప్రతి పాయింట్‌ కీలకమే. రన్‌రేట్‌ కూడా తెరపైకి వచ్చి ప్లేఆఫ్స్ జట్లను ఖరారు చేసే పరిస్థితులు సమీపించింది.  అయితే ఈ టోర్నీలో కొనసాగాలంటే… కచ్చితంగా గెలవాల్సిదే… ఈ పరిస్థితి రెండు జట్లు సమరానికి సిద్ధమయ్యాయి. చెన్నై, రాజస్థాన్‌ జట్ల మధ్య అబుదాబి వేదికగా జరుగనున్న మ్యాచ్‌లో నువ్వా నేనా అనే స్థాయిలో ఉత్కంఠగా సాగనుంది.

చెన్నై, రాజస్థాన్‌ ఇప్పటి వరకూ 22 మ్యాచుల్లో తలపడ్డాయి. అందులో 14 విజయాలతో చెన్నైదే టాప్ పొజిషన్‌. రాజస్థాన్‌ కేవలం 8 మ్యాచుల్లో గెలిచింది. అయితే ఇది గతం. ఈ లెక్కలు ఐపీఎల్ టీ20లో కుదరకపోవచ్చని చాలాసార్లు నిరూపితం అయ్యింది. ఇక  ఈ సీజన్‌లో జరిగిన మ్యాచ్‌లో మాత్రం స్మిత్‌సేనదే పైచేయి. చెన్నై ఆడిన గత ఐదు మ్యాచుల్లో రెండింట్లో గెలిచి.. మూడింట్లో నేల చూపులు చూసింది. మరోవైపు రాజస్థాన్‌ ఒక మ్యాచ్‌లో గెలిచి నాలుగింట్లో ఓడింది. మరి గతంలోని ఆధిపత్యాన్ని చెన్నై మరోసారి ప్రదర్శిస్తుందా.. లేక రాజస్థాన్‌ తన పైచేయి సాధిస్తుందా చూడాలి. అన్నది వేచి చూడాల్సిందే. ఈ అబుదాబి స్టేడియంలో ధోనీ సేనకు మంచి రికార్డు ఉంది.  చెన్నై ఆడిన నాలుగు మ్యాచుల్లో మూడింట్లో గెలిచింది. ఐదు మ్యాచ్‌లాడిన ఆర్ఆర్ జట్టు కూడా నాలుగు విజయాలను సొంతం చేసుకుంది.

గత మ్యాచ్‌లో ఢిల్లీ చేతిలో ఓడి త్రుటిలో మ్యాచ్‌ కోల్పోయిన చెన్నై సూపర్ కింగ్స్ ఈ మ్యాచ్‌లో ఎట్టిపరిస్థితుల్లో గెలువాలనే పట్టుదలతో సంమరానికి సిద్ధమవుతోంది. అయితే ధోనీ సేనలో ఓపెనర్లు బాగానే రాణిస్తున్నారు. రాయుడు సైతం నమ్మదగిన ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. ఆఖర్లో జడేజా మంచి ఫినిషింగ్‌ ఇస్తున్నాడు. ధోనీ, కేదార్‌ జాదవ్‌ నుంచి భారీ ఇన్నింగ్స్‌ రావాల్సిన సమయం ఆసన్నమైంది. ఆల్‌రౌండర్‌గా జట్టులోకి వచ్చిన జాదవ్‌ పోషిస్తున్న పాత్ర ఏంటీ అన్నది ఎవరికీ అర్థంకాని ప్రశ్నగా మారింది. ఇదిలా ఉండగా.. గాయంతో ఆల్‌రౌండర్‌ బ్రావో దూరం అయ్యాడు. దీంతో ఆ జట్టులో డెత్‌ ఓవర్లలో‌ బౌలింగ్‌ స్పెషలిస్టు లోటు ఏర్పడింది. ఈ కారణంగా చెన్నై ఇప్పటికే ఒక మ్యాచ్‌ను కోల్పోయింది. బ్రావో స్థానంలో లుంగీఎంగిడీని తీసుకునే అవకాశాలున్నాయి. గత మ్యాచ్‌లో విఫలమైన సామ్‌ కరన్‌ ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌, బౌలింగ్‌లో విజృంభిస్తే చెన్నై తేలిగ్గా గెలుస్తుంది.

రాజస్థాన్‌ జట్టుకు మంచి బ్యాటింగ్‌ ఆర్డర్‌ ఉంది. కానీ.. ఎవర్ని ఎప్పుడు పంపితే హిట్టింగ్ ఆడుతారు అనేది పెద్ద ప్రశ్న నెలకొంది. ఉతప్ప ఫామ్‌ అందుకోవడం ఆ జట్టుకు ఊరటనిచ్చే టాపిక్ కాగా… అయితే.. ఈ మ్యాచ్‌లో ఉతప్ప, బెన్‌స్టోక్స్‌ను ఏ స్థానంలో బ్యాటింగ్‌కు తీసుకొస్తారనేది కీలకమైన అంశంగా మారింది. మిడిల్ ఓవర్లలో వికెట్లు పడిపోతున్నాయి. దీంతో ఆ జట్టు బౌలర్ల శ్రమ వృథా అవుతోంది. ఇక బౌలింగ్‌ విషయానికి వస్తే.. ఎన్నో అంచనాలు పెట్టుకున్న ఆ జట్టు బౌలర్‌ జయదేవ్‌ ఉనద్కత్‌  ఈ సీజన్‌లో ప్రదర్శించలేక పోయాడు. గత చివరి మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు వేసి 46 పరుగులు సమర్పించుకున్నాడు. మరోసారి సంజు తన బ్యాట్‌కు పని చెబితే రాజస్థాన్‌ గెలుపు చాలా ఈజీగా మారుతుంది. ఈ రెండు జట్లకు ఈ మ్యాచ్ గెలువాల్సిన కీలక మ్యాచ్.

రాజ్, కావ్యల చేతుల మీదుగా సీతారాముల కళ్యాణం.. ఇరికించిన రుద్రాణి!
రాజ్, కావ్యల చేతుల మీదుగా సీతారాముల కళ్యాణం.. ఇరికించిన రుద్రాణి!
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
ప్లే ఆఫ్‌కు దగ్గరైన రాజస్థాన్.. పాయింట్ల పట్టికలో టాప్ 4 జట్లు..
ప్లే ఆఫ్‌కు దగ్గరైన రాజస్థాన్.. పాయింట్ల పట్టికలో టాప్ 4 జట్లు..
పక్కనే పెట్రోల్ బంకు..కారులోంచి మంటలు..!
పక్కనే పెట్రోల్ బంకు..కారులోంచి మంటలు..!
గాల్లోనే ఢీ కొట్టుకున్న2 మలేషియన్ హెలికాఫ్టర్లు.. 10 మంది మృతి
గాల్లోనే ఢీ కొట్టుకున్న2 మలేషియన్ హెలికాఫ్టర్లు.. 10 మంది మృతి
కుంభరాశిలో ఒంటరిగా శనీశ్వరుడు.. ఆ రాశుల వారికి కొత్త శుభ యోగాలు..
కుంభరాశిలో ఒంటరిగా శనీశ్వరుడు.. ఆ రాశుల వారికి కొత్త శుభ యోగాలు..
మామిడి పండ్లను తినే ముందు ఎందుకు నానబెట్టాలో తెలుసా.?
మామిడి పండ్లను తినే ముందు ఎందుకు నానబెట్టాలో తెలుసా.?
రోహిత్‌ను పక్కన పెట్టండి.. టీ20 ప్రపంచకప్‌లో కేరళ కుర్రాడిని
రోహిత్‌ను పక్కన పెట్టండి.. టీ20 ప్రపంచకప్‌లో కేరళ కుర్రాడిని
మేష రాశిలో శుక్ర, రవి సంచారం.. ఆ రాశుల వారికి రాజ యోగాలు!
మేష రాశిలో శుక్ర, రవి సంచారం.. ఆ రాశుల వారికి రాజ యోగాలు!
బర్త్‌డే కేక్‌ తిని చిన్నారి మృతి కేసులో బిగ్‌ ట్విస్ట్..
బర్త్‌డే కేక్‌ తిని చిన్నారి మృతి కేసులో బిగ్‌ ట్విస్ట్..
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.
గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.
మళ్లీ కెలుక్కుంటాను అంటే రా.! డైరెక్టర్ హరీష్ శంకర్ బిగ్ పంచ్.
మళ్లీ కెలుక్కుంటాను అంటే రా.! డైరెక్టర్ హరీష్ శంకర్ బిగ్ పంచ్.
చూస్తుంటే గుండె బరువుగా, నిండుగా ఉంది.. నాని ఎమోషనల్ పోస్ట్.!
చూస్తుంటే గుండె బరువుగా, నిండుగా ఉంది.. నాని ఎమోషనల్ పోస్ట్.!
యాక్షన్ కింగ్ కూతురు మామూలుగా లేదుగా.. హీరోయిన్స్ ను మించే అందం
యాక్షన్ కింగ్ కూతురు మామూలుగా లేదుగా.. హీరోయిన్స్ ను మించే అందం
గురు గ్రహంపై పెను తుపాను.. ఫొటోలు విడుదల చేసినా నాసా.
గురు గ్రహంపై పెను తుపాను.. ఫొటోలు విడుదల చేసినా నాసా.
ఇప్పటి వరకూ రామ్‌లల్లాను ఎంతమంది దర్శించుకున్నారో తెలుసా.?
ఇప్పటి వరకూ రామ్‌లల్లాను ఎంతమంది దర్శించుకున్నారో తెలుసా.?