Breaking News
  • అమరావతి: ఏపీ జర్నలిస్ట్‌ అక్రిడేషన్ల అంశంపై హైకోర్టులో విచారణ. 2 వారాల్లో అక్రిడేషన్ల పునరుద్ధరణ చేయాలని ఆదేశం. పూర్తి వివరాలతో అఫిడవిట్‌ దాఖలు చేయాలన్న హైకోర్టు. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా .
  • రేపు వరద ప్రాంతాల్లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పర్యటన. ఉ.9కు తార్నాకలోని మణికేశ్వర్‌నగర్‌లో పర్యటించనున్న కిషన్‌రెడ్డి . అనంతరం మెట్టుగూడ, అంకమ్మ బస్తీ, శ్యామలకుంట, ఓల్డ్‌ప్రేమ్‌నగర్‌.. నరేంద్రనగర్‌లోని ముంపు ప్రాంతాలను పరిశీలించనున్న కేంద్రమంత్రి. సా.5గంటలకు జీడిమెట్ల ఫాక్స్‌ సాగర్‌ చెరువు పరిశీలన.
  • అనంతపురం: వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్‌ కేసు. కర్నాటక లోకాయుక్తలో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ఫిర్యాదుపై స్పందించిన జేసీ ప్రభాకర్‌రెడ్డి. వాహనాల రిజిస్ట్రేషన్ వ్యవహారంలో.. కర్నాటక అధికారులపై ఫిర్యాదు చేసినప్పుడు ఏపీలో ఎందుకు చేయలేదని ప్రశ్న . చట్టం మీ చేతుల్లో ఉందని మమ్మల్ని అక్రమంగా అరెస్ట్‌ చేస్తారా. బీఎస్‌3 కన్నా ముందున్న వాహనాలు రోడ్లపై తిరుగుతున్నాయి. రాష్ట్రంలో లా అండ్‌ ఆర్డర్‌ పనిచేయడం లేదు. చట్టం తమ చేతుల్లో ఉందని ఇష్టమొచ్చినట్టు కేసులు పెడుతున్నారు. ఎన్ని కేసులు పెట్టినా మరోసారి జైలుకు వెళ్లేందుకు కూడా సిద్ధం-తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి.
  • విజయవాడ: దుర్గగుడి అభివృద్ధికి రూ.70 కోట్లు కేటాయించిన సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలిపిన మంత్రి వెల్లంపల్లి, దేవాలయాల అభివృద్ధి పట్ల సీఎం జగన్‌ చిత్తశుద్ధికి ఇది నిదర్శనం-వెల్లంపల్లి.
  • హైదరబాద్: వరదల్లో ఇంటర్మీడియట్‌ సర్టిఫికెట్లు కోల్పోయిన విద్యార్థులకు సర్టిఫికెట్లు జారీ, డూప్లికేట్‌ మెమోరాండం ఆఫ్‌ మార్క్స్‌ కోసం వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు-ఇంటర్మీడియట్‌ బోర్డ్‌, సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌.
  • అమరావతి: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం. రానున్న 24 గంటల్లో వాయువ్య దిశగా ప్రయాణించి వాయుగుండంగా మారే అవకాశం. తీవ్ర అల్పపీడనానికి అనుబంధంగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం . రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు. -అమరావతి వాతావరణ కేంద్రం.
  • తుళ్లూరు రిటైర్డ్‌ తహశీల్దార్‌ సుధీర్‌బాబు క్వాష్‌ పిటిషన్‌ కొట్టివేత. రాజధాని అసైన్డ్‌ భూముల కుంభకోణంలో సుధీర్‌బాబుపై సీఐడీ కేసు. ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేయాలని ఏపీ హైకోర్టులో సుధీర్‌బాబు పిటిషన్‌. సుధీర్‌బాబుతో పాటు విజయవాడకు చెందిన సురేష్‌ అరెస్ట్‌.

ఎస్పీబీ ఆరోగ్యంపై తాజా హెల్త్ బులిటెన్

 ప్ర‌ముఖ‌ గాయ‌కుడు ఎస్పీబీ ఆరోగ్యంపై తాజాగా హెల్త్ బులిటెన్ విడుదలైంది. ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం ఆరోగ్య‌ప‌రిస్థితిపై చెన్నై ఎంజీఎం ఆస్ప‌త్రి వైద్యులు హెల్త్ బులెటిన్ విడుద‌ల చేశారు. ఎస్పీ బాలు ఆరోగ్య ప‌రిస్థితి విష‌మంగా

Health Bulletin on SPB Health, ఎస్పీబీ ఆరోగ్యంపై తాజా హెల్త్ బులిటెన్

ప్ర‌ముఖ‌ గాయ‌కుడు ఎస్పీబీ ఆరోగ్యంపై తాజాగా హెల్త్ బులిటెన్ విడుదలైంది. ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం ఆరోగ్య‌ప‌రిస్థితిపై చెన్నై ఎంజీఎం ఆస్ప‌త్రి వైద్యులు హెల్త్ బులెటిన్ విడుద‌ల చేశారు. ఎస్పీ బాలు ఆరోగ్య ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్టు వైద్యులు  ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. హెల్త్ బులిటెన్ విడుదల చేయడంతో వెంటనే బాలు కుటుంబ సభ్యులు ఎంజీఎం ఆసుపత్రికి చేరుకుంటున్నారు.

క‌రోనాతో బాధ‌ప‌డుతూ ఎస్పీ బాలు ఆగ‌స్టు 5న ఎంజీఎం హెల్త్ కేర్ లో చేరారు. గ‌త 24 గంట‌ల్లో బాలు ఆరోగ్యం తీవ్రంగా క్షీణించింది. బాలుకు ఎక్మో, వెంటిలేట‌ర్ పై చికిత్స‌నందిస్తున్న‌ట్టు వెల్ల‌డించారు. ఎస్పీ బాలు 40 రోజులుగా ఎంజీఎం ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నెల 19 నుంచి బాలు ఆరోగ్యంపై ఆస్ప‌త్రి వ‌ర్గాలు హెల్త్ బులెటిన్ విడుద‌ల చేయలేదు. అయితే బాలు ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ అప్ డేట్స్ అందిస్తున్నారు.

బాలు ఆరోగ్య ప‌రిస్థితి విష‌మిస్తుంద‌న్న వార్త‌ల‌తో అభిమానులు ఆందోళ‌న చెందుతున్నారు. బాలు త్వ‌ర‌గా కోలుకుని క్షేమంగా తిరిగిరావాల‌ని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

Related Tags