Breaking: చెన్నైలో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతోన్న మంటలు..!

చెన్నైలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మాధవరం సమీపంలో ఉన్న ఓ ఆయిల్ తయారీ కంపెనీలో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 6 ఫైరింజన్లతో ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు శ్రమిస్తున్నారు.

Breaking: చెన్నైలో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతోన్న మంటలు..!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Feb 29, 2020 | 7:34 PM

చెన్నైలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మాధవరం సమీపంలో ఉన్న ఓ ఆయిల్ తయారీ కంపెనీలో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 6 ఫైరింజన్లతో ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు శ్రమిస్తున్నారు. ఆయిల్ తయారీ కేంద్రం కావడంతో మంటల తీవ్రత పెరుగుతూ వస్తోంది. దీంతో పరిసర ప్రాంతం మొత్తం దట్టమైన పొగ అలుముకుంది. మరోవైపు పరిసర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.