ప్రకాశంలో కలకలం సృష్టించిన పేలుడు

ప్రకాశం జిల్లా ఒంగోలులోని గాంధీ రోడ్డులోని భీమరాజు వారి వీధిలో పేలుడు కలకలం సృష్టించింది. ఓ ఫంక్షన్ హాల్ నుండి చెత్తను తరలిస్తున్న రిక్షాలోని ఓ కెమికల్ డబ్బా పెద్ద శబ్ధంతో పేలడంతో రిక్షా తొక్కుతున్న కనకరాజు అనే వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ ఘటనలో ఓ మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. నగరంలో నిత్యం జన సంచారంతో అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో భారీ పేలుడు సంభవించడంతో ప్రజలు ప్రాణభయంతో పరుగులు తీశారు. ఐతే జనసంచారం […]

  • Tv9 Telugu
  • Publish Date - 11:12 am, Fri, 15 March 19
ప్రకాశంలో కలకలం సృష్టించిన పేలుడు

ప్రకాశం జిల్లా ఒంగోలులోని గాంధీ రోడ్డులోని భీమరాజు వారి వీధిలో పేలుడు కలకలం సృష్టించింది. ఓ ఫంక్షన్ హాల్ నుండి చెత్తను తరలిస్తున్న రిక్షాలోని ఓ కెమికల్ డబ్బా పెద్ద శబ్ధంతో పేలడంతో రిక్షా తొక్కుతున్న కనకరాజు అనే వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ ఘటనలో ఓ మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. నగరంలో నిత్యం జన సంచారంతో అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో భారీ పేలుడు సంభవించడంతో ప్రజలు ప్రాణభయంతో పరుగులు తీశారు. ఐతే జనసంచారం తక్కువగా ఉండే వీధిలో ఈ ప్రమాదం జరగడంతో ప్రాణ నష్టం తప్పింది. సంఘనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.