బ్రేక్‌ఫాస్ట్‌తో గుండె జబ్బులకు చెక్..!

ఈ ఉరుకుల పరుగుల జీవితంలో తినడానికే సమయం దొరకనంత బిజీగా ఉంటున్నారు ప్రజలు. కానీ.. నిజానికి ఉదయం సమయం వ్యచ్ఛించి మరీ బ్రేక్ ఫాస్ట్ తినాలని ఆహార నిపుణులు సూచిస్తున్నారు. ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ తినకపోతే బరువు అధికంగా పెరిగే ప్రమాదముందని అమెరికాలోని మయో క్లినిక్ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కొన్ని రోజులు తిని, మానేసి, ఆ తర్వాత మళ్లీ తినడం చేస్తే ఈ ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుందని తెలిపారు. తాజాగా.. ఈ బ్రేక్ ఫాస్ట్‌పై […]

బ్రేక్‌ఫాస్ట్‌తో గుండె జబ్బులకు చెక్..!
Follow us

| Edited By: Team Veegam

Updated on: Feb 14, 2020 | 1:55 PM

ఈ ఉరుకుల పరుగుల జీవితంలో తినడానికే సమయం దొరకనంత బిజీగా ఉంటున్నారు ప్రజలు. కానీ.. నిజానికి ఉదయం సమయం వ్యచ్ఛించి మరీ బ్రేక్ ఫాస్ట్ తినాలని ఆహార నిపుణులు సూచిస్తున్నారు. ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ తినకపోతే బరువు అధికంగా పెరిగే ప్రమాదముందని అమెరికాలోని మయో క్లినిక్ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కొన్ని రోజులు తిని, మానేసి, ఆ తర్వాత మళ్లీ తినడం చేస్తే ఈ ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుందని తెలిపారు.

తాజాగా.. ఈ బ్రేక్ ఫాస్ట్‌పై గ్రీకులోని ఏథెన్సులోని కాపోడిస్త్రీ విశ్వవిద్యాలయం వారు పరిశోధనలు చేయగా పలు ఆసక్తికర విషయాలు తెలిసాయని వెల్లడించారు. మంచి ప్రోటీన్ ఉన్న బ్రేక్ ఫాస్ట్ తినేవారిలో గుండె ఆరోగ్యకరంగా పనిచేస్తుందని వెల్లడించారు. ఉదయం కనీసం 400 కేలరీలు ఉన్న ఆహారాన్ని తీసుకోవడం ద్వారా గుండెలోని ధమనులు సరైన విధంగా పనిచేస్తాయని.. దీని వలన గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తక్కువని గ్రీకు పరిశోధకులు సూచించారు.

అల్పాహారంలో ఏ ఆహారానైనా తీసుకుంటాము. కానీ.. ఉత్తమంగా జున్ను, పాలు, తృణధాన్యాలు (మొలకెత్తిన విత్తనాలు), నట్స్‌ను తీసుకోవడం ద్వారా మేలైన ఫలితాలు వస్తాయని నిపుణులు సూచిస్తున్నారు. 63 ఏళ్ల వయస్సున్న 2 వేల మందిపై ఈ కాపోడిస్త్రీ యూనివర్శిటీ వారు దాదాపు సంవత్సరం పాటు రీసెర్చ్ నిర్వహించారు. రోజు వివిధ రకాలుగా అల్పాహారంను తీసుకునే వారిని మూడు కేటగిరీలుగా విభజించినట్లు తెలిపారు.

సాధారణంగా ఒక మహిళకు రోజుకు 2వేల క్యాలరీస్ కావాలి. పురుషులకైతే 2,500 క్యాలరీస్ కావాలి. కానీ.. వీరు రోజుకు 240 నుంచి 900 వరకు మాత్రమే క్యాలరీస్‌ను తీసుకుంటున్నట్లు తెలియజేశారు. అతి తక్కువ శక్తి ఉన్న అల్పాహారం తినే వారిలో 9.5 శాతం మంది ఉన్నారు. సాధారణమైన అల్పాహారం తినే వారు 15.5 శాతం మంది ఉన్నట్లు పరిశోధనలో తేలింది. అంటే అధిక శక్తి ఉన్న అల్పాహారం తినే వారు కేవలం 8.7 శాతం మందే ఉన్నారు.

అధ్యయన రచయిత డాక్టర్ సోటిరియస్ సలామండ్రిస్ మాట్లాడుతూ.. మంచి ప్రోటీన్స్ ఉన్న అల్పాహారం మన జీవితంలో భాగంగా ఉండాలని అన్నారు. రోజూ క్యాలరీస్ ఉన్న ఆహారం తీసుకోవడం ద్వారా బీపీ, షుగర్ వంటి వ్యాధులకు చెక్ పెట్టవచ్చన్నారు. అలాగే గుండె సంబంధిత వ్యాధులకు దూరంగా ఉండవచ్చని తెలిపారు. అలాగే.. కొవ్వుతో ఆహారంకంటే ప్రోటీన్స్, పీచు పదార్థాలు కలిగిన ఆహారం మేలని చెప్పారు.

అలాగే.. సోఫాలో కూర్చొని టీవీ రిమోట్ ఆపరేట్ చేసే సమయంలో మన ఇంట్లోని పనులు చేసుకోవడం మంచి పద్దతి అన్నారు. ఉదయాన్నే యోగా, వాకింగ్, జాగింగ్ వంటివి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయని తెలియజేశారు.

దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..