పోలీస్‌లను ఖంగుతినిపిస్తోన్న వెరైటీ మోసాలు

డిజిటల్ టెక్నాలజీ పెరుగుతున్న కొలదీ నేరాలు, మోసాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. సోషల్ మీడియా అకౌంట్లు వేదికగా కేటుగాళ్లు అస్త్రాలు ప్రయోగిస్తున్నారు. అందినంత దోచుకుంటున్నారు. సాక్షాత్తూ పోలీస్ అధికారుల పేరుతో ఫేక్ ఫేస్ బుక్ అకౌంట్లు క్రియేట్ చేసి మరీ నెట్టింటే పనికానిచ్చేస్తున్నారు. అత్యవసరం ఉందని.. గూగుల్ పే, ఫోన్ పే అకౌంట్స్ కు కొంతడబ్బు పంపాలని పోలీస్ అధికారుల పేరుతో డబ్బులు గుంజుతున్నారు కేటుగాళ్ళు. వరంగల్ జిల్లాలో వరుసగా వెలుగుచూస్తున్న కొత్త తరహా మోసాలు పోలీసులకు […]

పోలీస్‌లను ఖంగుతినిపిస్తోన్న వెరైటీ మోసాలు
Follow us

|

Updated on: Sep 24, 2020 | 11:08 AM

డిజిటల్ టెక్నాలజీ పెరుగుతున్న కొలదీ నేరాలు, మోసాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. సోషల్ మీడియా అకౌంట్లు వేదికగా కేటుగాళ్లు అస్త్రాలు ప్రయోగిస్తున్నారు. అందినంత దోచుకుంటున్నారు. సాక్షాత్తూ పోలీస్ అధికారుల పేరుతో ఫేక్ ఫేస్ బుక్ అకౌంట్లు క్రియేట్ చేసి మరీ నెట్టింటే పనికానిచ్చేస్తున్నారు. అత్యవసరం ఉందని.. గూగుల్ పే, ఫోన్ పే అకౌంట్స్ కు కొంతడబ్బు పంపాలని పోలీస్ అధికారుల పేరుతో డబ్బులు గుంజుతున్నారు కేటుగాళ్ళు. వరంగల్ జిల్లాలో వరుసగా వెలుగుచూస్తున్న కొత్త తరహా మోసాలు పోలీసులకు సైతం మింగుడుపడకుండా ఉన్నాయి.

మొన్న మహబూబాబాద్ టౌన్ CI రవికుమార్, నిన్న జనగామ టౌన్ CI మల్లేష్ పేరిట డబ్బులు గుంజేశారు కిలాడీగాళ్లు. పోలీస్ ల పేరుతో నకిలీ ఫేస్ బుక్ అకౌంట్లు క్రియేట్ చేసి.. మోసాలకు పాల్పడుతున్న వ్యవహారంపై సైబర్ క్రైమ్ లో కేసు నమోదు చేసిన పోలీసులు.. వేగంగా విచారణ జరుపుతున్నారు. పోలీసులు, ఇతరుల పేరుతో నకిలీ అకౌంట్లు తెరచి ఎవరైనా డబ్బులు వసూలు చేయాలని చూస్తే కఠిన చర్యలు తప్పవని తెలంగాణ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.