నిండు గర్భిణీని.. మూడు కిలోమీటర్లు డోలాలో ఇలా..

ఓ వైపు అగ్రరాజ్యాలతో దేశం పోటీ పడుతుందని అనుకుంటే.. మరోవైపు అడవి బిడ్డల జీవితం మాత్రం ఇంకా అంధకారంలోనే ఉంటుంది. దేశం అభివృద్ది వైపు దూసుకెళ్తందంటూ ప్రచారాలు చేసుకుంటున్నప్పటికీ..

నిండు గర్భిణీని.. మూడు కిలోమీటర్లు డోలాలో ఇలా..
Follow us

| Edited By:

Updated on: Jul 08, 2020 | 1:31 PM

ఓ వైపు అగ్రరాజ్యాలతో దేశం పోటీ పడుతుందని అనుకుంటే.. మరోవైపు అడవి బిడ్డల జీవితం మాత్రం ఇంకా అంధకారంలోనే ఉంటుంది. దేశం అభివృద్ది వైపు దూసుకెళ్తందంటూ ప్రచారాలు చేసుకుంటున్నప్పటికీ.. ఇప్పటీకి ఇంకా మారు మూల గ్రామాల్లోకి కనీస రోడ్డు వసతి సరిగా లేదు. అత్యవసర పరిస్థితుల్లో గ్రామాల్లోకి వెళ్లాలంటే.. కనీస రహదారులు కూడా లేవు. అందుకు సాక్ష్యం మంగళ వారం ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఓ సంఘటన. వివరాల్లోకి వెళితే.. రాష్ట్రంలోని కొండగావ్‌ ప్రాంతంలోని మోహన్బిదా గ్రామానికి చెందిన ఓ మహిళ గర్భంతో ఉంది. అయితే పురిటి నొప్పులు రావడంతో.. ఆమె తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. దీంతో వెంటనే అంబులెన్స్‌కు కాల్ చేశారు. అయితే ఆ గ్రామానికి రహదారి సరిగ్గా లేకపోవడంతో.. అంబులెన్స్ సిబ్బంది గ్రామానికి రాలేమని చెప్పడంతో.. మూడు కిలోమీటర్ల దూరం వరకు డోలాలో తీసుకెళ్లారు. ఆ తర్వాత.. అక్కడి నుంచి అంబులెన్స్‌లో ఆస్పత్రికి చేర్చారు.

కాగా, గర్భిణీని డోలాలో తీసుకెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై స్పందించిన కొండగావ్‌ జిల్లా వైద్యాధికారి.. మారుమూల ప్రాంతాల్లో వర్షాలు పడిన సమయంలో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని.. ఆ గ్రామానికి వెళ్లేందుకు రహదారి సరిగ్గా లేకపోవడంతో.. ఆరోగ్య కార్యకర్తలు డోలాలో సురక్షితంగా అంబులెన్స్ వద్దకు చేర్చారని తెలిపారు. అనంతరం ఆమెను జిల్లా ఆస్పత్రికి తరలించామని.. అక్కడ ఆమె బిడ్డకు జన్మనిచ్చిందన్నారు. ప్రస్తుతం తల్లి, బిడ్డ ఇద్దరు కూడా సురక్షితంగా ఉన్నారు.