క‌రోనా నేప‌థ్యంలో ఏపీ పాఠ‌శాల వ్య‌వ‌స్థ‌లో కీల‌క మార్పులు…

మ‌హ‌మ్మారి కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో వచ్చే అక‌డ‌మిక్ ఇయ‌ర్ లో విద్యాసంస్థలు తీసుకోవాల్సిన చర్యలపై పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలను విడుద‌ల చేసింది.

క‌రోనా నేప‌థ్యంలో ఏపీ పాఠ‌శాల వ్య‌వ‌స్థ‌లో కీల‌క మార్పులు...
Follow us

|

Updated on: Jun 06, 2020 | 10:33 AM

మ‌హ‌మ్మారి కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో వచ్చే అక‌డ‌మిక్ ఇయ‌ర్ లో విద్యాసంస్థలు తీసుకోవాల్సిన చర్యలపై పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలను విడుద‌ల చేసింది. క్లాస్ రూములో 30మంది స్టూడెంట్స్ కంటే ఎక్కువ ఉంటే.. రెండు విడ‌త‌లుగా విభ‌జించి విద్యాబోధ‌న చేయాల‌ని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. క‌రోనా వ్యాప్తి అదుపులోకి వ‌చ్చి సాధార‌ణ ప‌రిస్థితులు ఏర్ప‌డే వ‌ర‌కు మధ్యాహ్న భోజన పథకం కింద విద్యార్థుల‌కు సరకులను పంపిణీ చేయాలని చెప్పింది.

స్కూల్ తెరిచే సమయంలో..

  • పాఠశాల ఆవరణను పూర్తిగా శానిటైజ్ చెయ్యాలి..క్రిమిసంహారాల‌తో కరోనా వైరస్‌ రహితంగా శుద్ధి చేయాలి.
  • ఎంట్ర‌న్స్ వ‌ద్ద స్టూడెంట్స్ టెంప‌రేచ‌ర్ పరిశీలించాలి.
  • టీచ‌ర్స్, స్టూడెంట్స్ త‌ప్ప‌నిస‌రిగా మాస్కులు ధ‌రించాలి.
  • 30మంది పిల్లలకు రెండు చొప్పున ఆటోమేటెడ్‌ చేతులు కడిగే యంత్రాలు ఏర్పాటు చేయాలి.
  • యూనిఫామ్ తో పాటు క‌ర్చీప్ కూడా త‌ప్ప‌నిసరి
  • సబ్బులు, శానిటైజర్లను స్కూలు యాజ‌మాన్యం అందుబాటులో ఉంచాలి
  • తాగునీరు, మధ్యాహ్న భోజనానికి విడతకు 10 మందికి మించి ఉండకూడదు.
  • మా‌ర్నింగ్ ప్రేయ‌ర్ రద్దు. క్లాసులో ఉండి మైకుల ద్వారా చేసుకోడానికి అనుమ‌తి
  • 30మంది స్టూడెంట్స్ మించి ఉంటే ఉదయం 8గంటల నుంచి 12గంటల వరకు, మధ్యాహ్నం 12.30గంటల నుంచి సాయంత్రం 4.30గంటల వరకు రెండు విడతల్లో క్లాసులు నిర్వహించాలి.
  • 50-100మంది ఉంటే రోజు విడిచి రోజు క్లాసెస్ నిర్వహించాలి
  • ప్రతి రోజు పావుగంట‌ కొవిడ్‌-19 నివారణ చర్యలను వివరించాలి
  • గేమ్స్ పీరియడ్‌ను రద్దు చేయాలి. వ్యక్తిగత వ్యాయామాలు, యోగా నేర్పించవచ్చు
  • ‘నో స్కూల్‌ బ్యాగ్‌ డే’ త‌ప్ప‌నిస‌రిగా నిర్వ‌హించాలి. పిల్లల్లో ఒత్తిడి తగ్గించేందుకు మూవీస్ లాంటివి చూపించాలి.
  • సాధారణ పరిస్థితులు వచ్చే వరకు మధ్యాహ్న భోజన పథకం కింద సరకులను అందించాలి.

పరీక్షల నిర్వ‌హ‌ణ స‌మ‌యంలో..

  • ఎగ్జామ్ సెంట‌ర్స్ వద్ద శరీర ఉష్ణోగ్రతను పరిశీలించాలి.
  •  ఒక్కో గదిలో 10మందిని మాత్రమే ఎగ్జామ్ కు అనుమతించాలి.
  •  కంటోన్మెంట్, క‌ట్ట‌డి ప్రాంతం నుంచి వచ్చే స్టూడెంట్స్ కు కలెక్టర్లు రవాణా సదుపాయం కల్పించాలి.
  •  కరోనా సింట‌మ్స్ ఉండే వారి కోసం ప్రత్యేక ఐసొలేషన్‌ గది ఏర్పాటు చేయాలి.
  •  వాల్యువేష‌న్ సెంట‌ర్ల‌ను జిల్లాస్థాయిలో ఏర్పాటు చేయాలి.

మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి
మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే