పోలవరం పేరు మార్చాలంటూ డిమాండ్..

ఏపీ ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్ట్‌ పేరును మార్చాలంటూ బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవిల్ నరసింహారావు డిమాండ్ చేస్తున్నారు. ప్రాజెక్ట్ పేరును ‘ప్రధానమంత్రి పోలవరం ప్రాజెక్ట్’గా మార్చాలంటూ విచిత్రమైన ప్రపోజల్‌ను తీసుకొచ్చారు. ఇలా పేరు మార్చడం వెనుక ఆయన బలమైన కారణం చెబుతున్నారు. ప్రాజెక్ట్ ఖర్చంతా కేంద్ర ప్రభుత్వం భరిస్తుండటం వల్ల.. ఈ పేరు పెట్టాలని ఆయన భావిస్తున్నారు. మంగళవారం రాజ్యసభలో జాతీయ ప్రాజెక్టుల గురించి ప్రస్తావన రాగా.. జీవీఎల్ పోలవరం ప్రాజెక్ట్ గురించి మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వానికి […]

పోలవరం పేరు మార్చాలంటూ డిమాండ్..
Follow us

| Edited By:

Updated on: Dec 11, 2019 | 10:11 PM

ఏపీ ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్ట్‌ పేరును మార్చాలంటూ బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవిల్ నరసింహారావు డిమాండ్ చేస్తున్నారు. ప్రాజెక్ట్ పేరును ‘ప్రధానమంత్రి పోలవరం ప్రాజెక్ట్’గా మార్చాలంటూ విచిత్రమైన ప్రపోజల్‌ను తీసుకొచ్చారు. ఇలా పేరు మార్చడం వెనుక ఆయన బలమైన కారణం చెబుతున్నారు. ప్రాజెక్ట్ ఖర్చంతా కేంద్ర ప్రభుత్వం భరిస్తుండటం వల్ల.. ఈ పేరు పెట్టాలని ఆయన భావిస్తున్నారు. మంగళవారం రాజ్యసభలో జాతీయ ప్రాజెక్టుల గురించి ప్రస్తావన రాగా.. జీవీఎల్ పోలవరం ప్రాజెక్ట్ గురించి మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వానికి పరోక్షంగా చురకలంటిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం వైఖరి కారణంగానే ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు విడుదల చేయడంలో ఆలస్యం జరుగుతోందని పేర్కొన్నారు. 

ఇప్పటివరకు పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం కొరకు కేంద్ర ప్రభుత్వం 6,764 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించింది. ఇటీవల ఆర్థిక మంత్రిత్వ శాఖ పోలవరం కోసం మరో 1850 కోట్ల రూపాయలను విడుదల చేసిందని జీవీఎల్ అన్నారు. అయితే 2014కి ముందు పోలవరం నిర్మాణానికి ఎంత ఖర్చు చేశారన్న దానిపై ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇవ్వడంలో విఫలమైందన్నారు. ప్రాజెక్ట్ నిర్మాణంలో ఎక్కువ శాతం నిధులను కేంద్రం ప్రభుత్వం ఇస్తుండటం వల్ల ‘ప్రధానమంత్రి పోలవరం ప్రాజెక్ట్’గా పేరును మార్చాలని జీవీఎల్ స్పష్టం చేశారు. అయితే మిగతా బీజేపి నేతలు ఈ విషయంపై పెద్దగా పట్టించుకోలేదు.