Breaking News
  • సికింద్రాబాద్‌-మచిలీపట్నం మధ్య ప్రత్యేక రైళ్లు. డిసెంబర్‌ 1,8,15,22,29 తేదీల్లో నడవనున్న ప్రత్యేక రైళ్లు. మచిలీపట్నంలో మధ్యాహ్నం 2:25కి బయల్దేరి.. రాత్రి 10:10కి సికింద్రాబాద్‌కు చేరుకోనున్న ప్రత్యేక రైలు. అదేరోజు సికింద్రాబాద్‌ నుంచి రాత్రి 11:55కి బయల్దేరి.. మరుసటి రోజు ఉ.8:55కి మచిలీపట్నం చేరుకోనున్న ప్రత్యేక రైలు.
  • ఏపీకి నెంబర్లు కేటాయించిన కేంద్రం. అక్రమ మైనింగ్‌, అనధికార మద్యం అమ్మకాలపై.. ఫిర్యాదులకు నెంబర్లు కేటాయించిన కేంద్ర సర్కార్‌. అక్రమ మైనింగ్‌పై ఫిర్యాదు కోసం 14400 నెంబర్‌.. అనధికార మద్యంపై ఫిర్యాదుకు 14500 నెంబర్‌ కేటాయింపు.
  • మళ్లీ పెరిగిన బంగారం ధరలు. పెళ్లిళ్ల సీజన్‌ కొనుగోళ్లతో పెరిగిన పసిడి ధరలు. 10గ్రాముల 24క్యారెట్ల బంగారంపై రూ.225 పెంపు. రూ.38,715 పలుకుతున్న 10గ్రాముల బంగారం. రూ.440 పెరిగి రూ.45,480కి చేరిన కిలో వెండి ధర.
  • ఛండీగడ్‌: 2019 ప్రపంచ కబడ్డీ కప్‌కు పంజాబ్ ఆతిథ్యం. డిసెంబర్‌ 1 నుంచి 9 వరకు మ్యాచ్‌ల నిర్వహణ. సుల్తాన్‌పూర్‌ లోధిలోని గురునానక్‌ స్టేడియంలో ప్రారంభ వేడుక. ప్రపంచ కబడ్డీ టోర్నీలో పాల్గొననున్న భారత్, అమెరికా, శ్రీలంక.. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, కెన్యా, న్యూజిలాండ్‌, పాకిస్తాన్‌, కెనడా జట్లు.
  • ఓటర్ల జాబితా సవరణకు కొత్త షెడ్యూల్‌ విడుదల. జనవరి 1, 2020 అర్హత తేదీతో ఓటర్ల జాబితా సవరణ. ఓటర్ల వివరాల పరిశీలనకు ఈనెల 30 తుది గడువు. డిసెంబర్‌ 16న ఓటర్ల జాబితా ముసాయిదా ప్రచురణ. 2020, జనవరి 15న అభ్యంతరాలు, వినతుల స్వీకరణ.
  • టిక్‌టాక్‌కు పోటీగా త్వరలో ఇన్‌స్టాగ్రామ్‌ కొత్త ఫీచర్‌. రీల్స్‌ పేరిట ఓ కొత్త ఫీచర్‌ అందుబాటులోకి. ఇన్‌స్టాగ్రామ్‌లోని ఎక్స్‌ప్లోర్‌ సెక్షన్‌లో కొత్త ఫీచర్. కొత్త ఫీచర్‌లో టిక్‌టాక్ మాదిరిగా వీడియోలు క్రియేట్‌ చేసే సౌకర్యం.

‘విక్రమ్ ల్యాండర్’ జాడ దొరికేసింది..! ఎక్కడుందంటే..?

చంద్రయాన్‌-2లో భాగమైన విక్రమ్ ల్యాండర్‌ని భారత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా.. చంద్రుడిపైకి పంపింది. మొదటి విడత సక్సెస్ అయినా.. ఆ తరువాత దాని జాడ కనిపించకుండా పోయింది. విక్రమ్ కోసం.. నాసా కూడా వెళ్లి చేతులెత్తేసింది. ఆ తరువాత.. విక్రమ్ ల్యాండర్‌ను కనిపెట్టేందుకు నాసా.. ల్యూనార్ రికొన్నైస్సాన్స్ ఆర్బిటర్‌ను రంగంలోకి దింపింది. సెప్బెంబర్ 17న చంద్రుడిపైకి వెళ్లిన ఎల్‌ఆర్‌ఓ.. ప్రయత్నించి విఫలమైంది. దీంతో.. అందరూ.. విక్రమ్‌పై ఆశలు వదులుకున్నారు. మరి విక్రమ్ ల్యాండర్ ఎక్కడ ఉంది..? ఎందుకు సిగ్నల్స్ అందడం లేదు..? ఎందుకు పనిచేయట్లేదు..? సరిగ్గా ల్యాండింగ్ అయ్యిందా.. లేదా..! ఇలా అనేక ప్రశ్నలు.. ప్రతీ ఒక్కరికీ.. ఎదురయ్యాయి.

అయితే.. తాజాగా.. విక్రమ్ జాడ దొరికిందంటూ.. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) తెలిపింది. విక్రమ్ ల్యాండర్ హార్డ్ ల్యాండింగ్ అయ్యిందని.. సూర్యుడు ఎండ తగలని ప్రదేశంలో పడిందని.. దానికి సంబంధించిన 2జీబీ వ్యాల్యూ కలిగిన.. ఒక ఫొటోను విడుదల చేసింది. కానీ.. ఈ విషయం నమ్మశక్యంగా లేదని.. అంటున్నారు. ఎందుకంటే.. నాసా టెక్నాలజీ చాలా పెద్దది. నాసా దగ్గర.. పెద్ద పెద్ద పవర్‌ఫుల్ కెమెరాలు ఉన్నాయి. చంద్రుడిపై ఒక ఫొటో తీస్తే.. దాని ఉపరితలంపై ప్రతీ చిన్న రాయి క్లియర్‌ ఫుల్‌గా కనిపిస్తుంది. ఇప్పడు నాసా విడుదల చేసిన ఫొటోలో.. విక్రమ్ ల్యాండర్ స్పష్టంగా కనిపిస్తోంది. వెలుగు వచ్చిన తరువాత.. ల్యాండర్‌ను తీసే ప్రయత్నం చేస్తామని వారు ఓ పిక్చర్ రిలీజ్ చేశారు.