Breaking News
  • అసెంబ్లీ సాక్షిగా ఐదు కోట్ల ఆంధ్రులను మోసం చేశారు. న్యాయం చేయమని రోడ్డుపైకి వచ్చిన మహిళను అరెస్ట్ చేస్తున్నారు. మహిళలపై లాఠీచార్జ్‌ దారుణం-నారా లోకేష్‌. మండలిలో రేపు ఏం జరుగుతుందో ప్రజలే చూస్తారు-లోకేష్‌.
  • బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా ఎన్నిక సంతోషకరం. తెలంగాణ తరపున అభినందనలు తెలిపాం. తెలంగాణపై దృష్టిపెట్టాలని కోరాం-టీఎస్‌ బీజేపీ చీఫ్‌ డా.లక్ష్మణ్‌. త్వరలో తెలంగాణలో జేపీ నడ్డా పర్యటిస్తారు. కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌, మజ్లిస్‌ ఒక గూటి పక్షులే-డా.లక్ష్మణ్‌.
  • అమరావతి: పవన్‌తో పోలీసుల మంతనాలు. రాజధాని గ్రామాల పర్యటన వాయిదా వేసుకోవాలంటున్న పోలీసులు.
  • కరీంనగర్‌లో గంజాయి ముఠా గుట్టురట్టు. రూ.30 లక్షల విలువైన గంజాయి పట్టివేత. ముగ్గురు అరెస్ట్‌, ట్రక్‌ స్వాధీనం.
  • చెన్నై విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత. అబుదాబి నుంచి చెన్నైకి తరలిస్తున్న 3.7 కేజీల బంగారం పట్టివేత. ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న కస్టమ్స్ అధికారులు.

‘చంద్రయాన్-3’ షురూ!..ఈ సారి పక్కా ప్రణాళిక

Chandrayaan 3: ISRO aims for the moon once again, ‘చంద్రయాన్-3’ షురూ!..ఈ సారి పక్కా ప్రణాళిక

చంద్రయాన్-2 ప్రయోగంతో ఇటీవల భారత్ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. అయితే అది జస్ట్ మిస్ అవ్వడంతో ఈ సారి మరింత కసిగా చంద్రయాన్-3 తో  ముందడుగు వెయ్యాలని ఇస్రో వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే ఇందుకోసం హైలెవల్ కమిటీ ఏర్పాటు చేసి విసృత స్థాయి చర్చలు జరిపింది. చంద్రయాన్‌-3కి సంబంధించి అన్ని రకాల వ్యూహాలను.. ఈ కమిటీ ప్రభుత్వానికి సమర్పిస్తుంది.

తిరువనంతపురంలోని విక్రం సారాభాయ్ స్పేస్ సెంటర్‌ డైరెక్టర్ సోమనాథ్ ఈ కమిటీకి హెడ్‌గా వ్యవహరించనున్నారు. ఈ సారి సాప్ట్ ల్యాండింగ్ లక్ష్యంగా కమిటీ పూర్తి లక్ష్యాలను నిర్దేశించుకుంది.  చంద్రయాన్-3 ప్రయోగానికి నవంబర్ 2020 ని డెడ్‌లైన్‌గా పెట్టుకున్నారు శాస్త్రవేత్తలు. ఇస్రో తాజా అడుగులతో దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.