చంద్రయాన్ 2 అద్భుతం సృష్టించనుంది..!

Chandrayaan 2 All Set To Land On The Moon, చంద్రయాన్ 2 అద్భుతం సృష్టించనుంది..!

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. ఇస్రో శాస్త్రవేత్తలు చేసిన కృషికి తగిన ఫలితం దక్కే రోజు ఇది. జూలై 22న భారత అంతరిక్ష సంస్థ ఇస్రో చంద్రుడిపైకి పంపిన చంద్రయాన్ 2 మూడో ఘట్టాన్ని కూడా విజయవంతంగా పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. దీనితో చంద్రుడికి కేవలం 35 కిలోమీటర్ల దీర్ఘావృత్తాకార కక్ష్యలో చంద్రయాన్ 2 తిరుగుతుండడం విశేషం.

ఇస్రో శాస్త్రవేత్తలు బుధవారం తెల్లవారుజామున 3.42 గంటలకు చంద్రుడి కక్షలో తిరుగుతున్న చంద్రయాన్ 2లోని ల్యాండర్ లో ఉన్న ఇంధనాన్ని 9 సెకండ్ల పాటు మండించారు. బెంగళూరులోని బైలాలు మిషన్ కంట్రోల్ సెంటర్ నుంచి వారు ఈ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారు. దీంతో దూరంగా ఉన్న కక్ష్యలోంచి చంద్రయాన్ 2 చంద్రుడికి దగ్గరగా 35కి.మీల దూరంలోని కక్ష్యలోకి వచ్చింది.

Chandrayaan 2 All Set To Land On The Moon, చంద్రయాన్ 2 అద్భుతం సృష్టించనుంది..!

ఇక అత్యంత కీలకమైన దశలో ల్యాండర్‌ను చంద్రుడిపై దించే ఘట్టాన్ని 7వ తేదీ అర్ధరాత్రి 1.30 గంటల నుంచి 2.30 మధ్య నిర్వహించడానికి ఇస్రో శాస్త్రవేత్తలు రెడీ అయ్యారు. ల్యాండర్‌ను చంద్రుడి ఉపరితలం పైకి 35 కి.మీల ఎత్తునుంచి జాగ్రత్తగా దించుతారు. ల్యాండర్ దిగగానే అందులోంచి కొద్దిసేపటికి రోవర్ చంద్రుడి మీదకు దిగుతుంది. ఇది 14 రోజుల పాటు ప్రయాణిస్తూ పరిశోధనలు చేస్తూ ఫొటోలు తీసి భూమికి పంపుతుంది. మరోవైపు చంద్రయాన్ 2 మాత్రం చంద్రుడి చుట్టూ 96 కిమీల దగ్గరైన వృత్తాకార కక్ష్యలో తిరుగుతూ కిందనున్న ల్యాండర్ కదలికలను గమనిస్తుంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *