Breaking News
  • ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో టీఆర్‌ఎస్‌ క్లీన్‌స్వీప్‌. జిల్లాలోని 9 మున్సిపాలిటీలు కైవసం చేసుకున్న టీఆర్‌ఎస్‌. జనగాం, భూపాలపల్లి, పరకాల, నర్సంపేట, మహబూబాబాద్‌.. వర్ధన్నపేట, డోర్నకల్‌, తొర్రూర్‌, మరిపెడలో టీఆర్‌ఎస్‌ విజయం. జనగాం: టీఆర్‌ఎస్‌-13, కాంగ్రెస్‌-10, బీజేపీ-4, ఇతరులు-3. భూపాలపల్లి: టీఆర్‌ఎస్‌-23, బీజేపీ-1, ఇతరులు-6. పరకాల: టీఆర్‌ఎస్‌-17, బీజేపీ-3, కాంగ్రెస్‌-1, ఇతరులు-1. నర్సంపేట: టీఆర్‌ఎస్‌-16, కాంగ్రెస్‌-6, ఇతరులు-2. తొర్రూరు: టీఆర్‌ఎస్‌-12, కాంగ్రెస్‌-3, బీజేపీ-1. వర్ధన్నపేట: టీఆర్‌ఎస్‌-8, కాంగ్రెస్‌-2, బీజేపీ-1, ఇతరులు-1. డోర్నకల్‌: టీఆర్‌ఎస్‌-11, కాంగ్రెస్‌-1, ఇతరులు-3. మహబూబాబాద్‌: టీఆర్ఎస్‌-19, కాంగ్రెస్‌-10, ఇతరులు-7. మరిపెడ: టీఆర్‌ఎస్‌-15.
  • రైతులపై దాడి చేయించిన జగన్‌ రైతు ద్రోహిగా మరింత దిగజారారు. మూడు రాజధానుల్లో ఆయన స్వార్థం తప్ప రాజధానులు లేవని.. ప్రజలకు అర్థమైందన్న ఆందోళన జగన్‌ను వెంటాడుతోంది-లోకేష్‌. వైసీపీ రౌడీలను రంగంలోకి దింపి జేఏసీ శిబిరానికి నిప్పంటించారు. తెనాలిలో వైసీపీ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం-నారా లోకేష్‌. జగన్‌ తాటాకు చప్పుళ్లకు భయపడేవారెవరూ లేరు-ట్విట్టర్‌లో నారా లోకేష్‌.
  • చిత్తూరు: గ్రేడ్‌-3 మున్సిపాలిటీగా కుప్పం గ్రామ పంచాయతీ. గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసిన ప్రభుత్వం. ఏడు గ్రామపంచాయతీలను కుప్పం మున్సిపాలిటీలో విలీనం. కుప్పం మున్సిపాలిటీలో చీలేపల్లి, దళవాయి కొత్తపల్లి, చీమనాయనపల్లి.. సామగుట్టపల్లి, తంబిగానిపల్లి, కమతమూరు, అనిమిగానిపల్లి విలీనం. చంద్రబాబు నియోజకవర్గానికి మున్సిపాలిటీ హోదా కల్పించిన ప్రభుత్వం.
  • కరీంనగర్‌: తిమ్మాపూర్‌ దగ్గర ఎస్సారెస్పీ కెనాల్‌లో కారు బోల్తా. కారులో ఉన్న దంపతులు మృతి. మృతులు సుల్తానాబాద్‌ వాసులుగా గుర్తింపు.
  • విశాఖ: గణతంత్ర దినోత్సవం సందర్భంగా హై అలర్ట్. విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు భద్రత పెంపు.

‘ఇస్రో’ ట్వీట్.. ‘చంద్రయాన్ 2’ ఫెయిల్ అయినట్టేనా..!

ISRO thanks tweet, ‘ఇస్రో’ ట్వీట్.. ‘చంద్రయాన్ 2’ ఫెయిల్ అయినట్టేనా..!

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్ 2లోని విక్రమ్ ల్యాండర్ గురించి ఇంకా ఉత్కంఠ వీడట్లేదు. చంద్రుడి ఉపరితలానికి 2.1కి.మీల దూరంలో ఉండగా.. విక్రమ్ ల్యాండర్‌తో సంబంధాలు తెగిపోయాయి. దీంతో అప్పటి నుంచి ఈ ల్యాండర్‌తో సంకేతాలను పునరుద్ధరించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఇక దీనికి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా కూడా తన సహాయాన్ని అందించేందుకు ముందుకు వచ్చింది. ఇక నాసా ప్రయోగించిన లూనార్ రికాయిన్నెసెన్స్ ఆర్బిటర్(ఎల్ఆర్ఓ) మంగళవారం చంద్రుడి ఉపరితలానికి చేరుకొని.. విక్రమ్ ల్యాండ్ అయిన ప్రాంతం నుంచి ప్రయాణం చేసినట్లుగా తెలుస్తోంది. అలాగే ల్యాండర్ ఉన్న ప్రాంతాన్ని ఫొటోలు తీసినట్లుగా సమాచారం.

ఇదిలా ఉంటే తాజాగా ఇస్రో ఓ ట్వీట్ చేసింది. ‘‘మాకు మద్దతుగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయుల ఆశలు, కలల స్ఫూర్తితో మేము ముందుకు సాగుతాం’’ అని ఇస్రో ట్వీట్ చేసింది. దీంతో ‘చంద్రయాన్ 2’ ప్రయోగం విఫలైమంది అన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై ఇస్రో అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

కాగా చంద్రుడి దక్షిణ ధ్రువంపై నీటి జాడను కనుగొనేందుకు ఇస్రో ఈ ప్రయోగం చేపట్టింది. జూన్ 22న నింగిలోకి దూసుకుపోయిన చంద్రయాన్ 2 ఆ తరవాత ఒక్కో దశను విజయవంతంగా పూర్తి చేసుకుంటూ చంద్రుడి ఉపరితల కక్ష్యలోకి చేరింది. అక్కడ ఆర్బిటర్ నుంచి విడిపోయిన విక్రమ్ ల్యాండర్.. చంద్రుడి మీద దిగడానికి 2.1కి.మీల దూరంలో ఉండగా సంకేతాలు ఇవ్వడం మానేసింది. దీంతో విక్రమ్ ల్యాండర్ బలంగా చంద్రుడి భూతలాన్ని ఢీకొట్టిందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. ఇక ఆ సమయంలో ఇస్రో శాస్త్రవేత్తలకు దేశవ్యాప్తంగా మద్దతు లభించింది. మీ వెంట మేమున్నామంటూ ప్రముఖులు మొదలుకొని సామాన్యుల వరకు ప్రతి ఒక్కరు తమ సపోర్ట్‌ను ప్రకటించారు. అయితే ఆర్బిటర్ పంపిన ఫొటోలతో ల్యాండర్‌ ముక్కలు అవ్వలేదని నిర్దారణకు వచ్చారు. ఆ తరువాత విక్రమ్ ల్యాండర్‌తో సంకేతాలు పునరుద్ధరించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇక ల్యాండర్‌తో సంబంధాల పునరుద్ధరణకు మరో మూడు రోజుల సమయం మాత్రమే ఉంది. మరి ల్యాండర్ పరిస్థితి ఏంటి..? చంద్రయాన్ 2 ప్రయోగం ఏమైంది..? అన్న ప్రశ్నలకు ఇస్రో శాస్త్రవేత్తలు సమాధానం చెప్తారేమో చూడాలి.  అయితే ఆర్బిటర్ మాత్రం మరో ఏడేళ్లు చంద్రుడి చుట్టూ పరిభ్రమించనుంది.