రెండో కక్ష్యలోకి విజయవంతంగా చంద్రయాన్-2

భారత అంతరిక్ష పరిశోధన సంస్ధ ఇస్రో ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్‌-2 వాహకనౌక భూ కక్ష్యను పెంచే రెండో ప్రక్రియ కూడా విజయవంతమైంది. శుక్రవారం తెల్లవారుజామున 1.08 నిమిషాలకు రెండో సారి కక్ష్యను పెంచారు. ఆన్‌బోర్డులో ఉన్న ఇంధనాన్ని 883 సెకెన్లపాటు మండించడం ద్వారా కక్ష్యను విజయవంతంగా పెంచినట్టుగా శాస్త్రవేత్తలు వెల్లడించారు. మూడోసారి ఈ కక్ష్యను జూలై 29న మధ్యాహ్నం చేపట్టనున్నట్టు అధికారులు తెలిపారు. ఈవిధంగా కక్ష్యలు పెంచడం అనేది వచ్చేనెల ఆగస్టు 14 వరకు చేస్తామని తెలిపారు. […]

రెండో కక్ష్యలోకి  విజయవంతంగా  చంద్రయాన్-2
Follow us

| Edited By:

Updated on: Jul 26, 2019 | 3:05 PM

భారత అంతరిక్ష పరిశోధన సంస్ధ ఇస్రో ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్‌-2 వాహకనౌక భూ కక్ష్యను పెంచే రెండో ప్రక్రియ కూడా విజయవంతమైంది. శుక్రవారం తెల్లవారుజామున 1.08 నిమిషాలకు రెండో సారి కక్ష్యను పెంచారు. ఆన్‌బోర్డులో ఉన్న ఇంధనాన్ని 883 సెకెన్లపాటు మండించడం ద్వారా కక్ష్యను విజయవంతంగా పెంచినట్టుగా శాస్త్రవేత్తలు వెల్లడించారు. మూడోసారి ఈ కక్ష్యను జూలై 29న మధ్యాహ్నం చేపట్టనున్నట్టు అధికారులు తెలిపారు. ఈవిధంగా కక్ష్యలు పెంచడం అనేది వచ్చేనెల ఆగస్టు 14 వరకు చేస్తామని తెలిపారు. ప్రస్తుతం చంద్రయాన్‌-2 వాహకనౌక 251 x 54829 km. కిలోమీటర్ల ఎత్తున ఉన్న భూ కక్ష్యలోకి చేరింది.