చంద్రయాన్‌-2 కక్ష్య మళ్లీ పెంపు..

Chandrayaan-2 Orbit Successfully Raised for Fourth Time: ISRO, చంద్రయాన్‌-2 కక్ష్య మళ్లీ పెంపు..

ఇస్రో ప్రతిష్టాత్మకంగా చంద్రయాన్‌-2ను జూలై 22న ప్రయోగించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఉపగ్రహ కక్ష్యను శుక్రవారం మధ్యాహ్యం మరోసారి పెంచారు. ఇందుకోసం చంద్రయాన్‌-2 ఇంజిన్లను 10 నిమిషాల పాటు మండించారు. ప్రస్తుతం ఉపగ్రహం నాలుగో భూ స్థిర కక్ష్యలో తిరుగుతోందని ఇస్రో వర్గాలు వెల్లడించాయి. తిరిగి ఆగస్టు 6న కక్ష్య పెంపు ప్రక్రియను చేపడతామని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. ఆగస్టు 20 కల్లా చంద్రయాన్‌-2 చంద్రుడి స్థిర కక్ష్యలోకి చేరనుంది. ఆ తర్వాత చంద్రయాన్‌-2 నుంచి ల్యాండర్‌ విక్రమ్‌ విడిపోయి చంద్రుడి ఉపరితలంపై దిగనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *