ఇస్రో వదిలినా.. నాసా వెంటాడుతోంది

NASA trying to speak Vikram, ఇస్రో వదిలినా.. నాసా వెంటాడుతోంది

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రయోగించిన చంద్రయాన్ 2పై ఇస్రో శాస్త్రవేత్తలు ఆశలు దాదాపుగా ఆవిరి అయ్యాయి. ఇన్నిరోజులు విక్రమ్ ల్యాండర్‌తో సంబంధాలు పునరుద్ధరించుకోవడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు ఇస్రో శాస్త్రవేత్తలు. అయినా అక్కడి నుంచి ఎలాంటి సిగ్నల్స్ రాలేదు. ఇక మరికొన్ని గంటల్లో చంద్రుడిపై రాత్రి సమయం ప్రారంభం కానుంది. దీని వలన అక్కడ మైనస్ 200 ఉష్ణోగ్రతలు ఉండనుండగా.. విక్రమ్‌లోని పరికరాలు శాశ్వతంగా దెబ్బతినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో గత కొన్నేళ్లుగా చంద్రయాన్ 2 కోసం కష్టపడ్డ ఇస్రో శాస్త్రవేత్తలు తమ ఆశలను వదులుకున్నారు. అయితే ఇస్రో వదులుకున్నా.. నాసా మాత్రం చంద్రయాన్ 2ను వెంటాడుతోంది. విక్రమ్‌ ల్యాండర్‌తో సంబంధాలను మెరుగుపరుచుకోవాలని నాసా శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. మరికొంత సేపట్లో విక్రమ్ ల్యాండర్‌కు సిగ్నల్‌ను పంపాలని వారు భావిస్తున్నారు. ఒకవేళ అప్పుడైనా విక్రమ్ స్పందిస్తే.. ఇస్రో శాస్త్రవేత్తల ఆశలకు జీవం పోసినట్లు అవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *