Chandrayaan 2: ఆర్బిటర్ నుంచి వేరుపడ్డ ల్యాండర్.. ఇస్రో మరో ఘనత

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో చరిత్ర సృష్టించింది. ఇస్రో ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన ‘చంద్రయాన్ 2’ ప్రయోగంలో ఆర్బిటర్ నుంచి ల్యాండర్ విక్రమ్ విడిపోయింది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.16గంటలకు ఆర్బిటర్ నుంచి విక్రమ్ విడిపోయింది. కాగా చంద్రయాన్ 2ను ప్రయోగించినప్పటి నుంచి కక్ష్య తగ్గింపు ప్రక్రియను 5సార్లు ఇస్రో సమర్థవంతంగా చేపట్టింది. దీంతో ఇస్రో శాస్త్రవేత్తలు సంబరాలు జరుపుకుంటున్నారు. కాగా జూలై 22న శ్రీహరికోట నుంచి చంద్రయాన్ 2ను ప్రయోగించారు. ఆ తరువాత […]

Chandrayaan 2: ఆర్బిటర్ నుంచి వేరుపడ్డ ల్యాండర్.. ఇస్రో మరో ఘనత
Follow us

| Edited By:

Updated on: Sep 02, 2019 | 4:17 PM

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో చరిత్ర సృష్టించింది. ఇస్రో ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన ‘చంద్రయాన్ 2’ ప్రయోగంలో ఆర్బిటర్ నుంచి ల్యాండర్ విక్రమ్ విడిపోయింది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.16గంటలకు ఆర్బిటర్ నుంచి విక్రమ్ విడిపోయింది. కాగా చంద్రయాన్ 2ను ప్రయోగించినప్పటి నుంచి కక్ష్య తగ్గింపు ప్రక్రియను 5సార్లు ఇస్రో సమర్థవంతంగా చేపట్టింది. దీంతో ఇస్రో శాస్త్రవేత్తలు సంబరాలు జరుపుకుంటున్నారు.

కాగా జూలై 22న శ్రీహరికోట నుంచి చంద్రయాన్ 2ను ప్రయోగించారు. ఆ తరువాత కొద్ది రోజుల పాటు చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించిన చంద్రయాన్ 2 ఒక్కో కక్ష్యను దాటుకుంటూ.. చంద్రుడికి మరింత దగ్గరగా చేరింది. ఈ నేపథ్యంలో ఈ నెల 7న చంద్రుడిపై ల్యాండర్ దిగనుంది.